తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ladies Undergarments Thief : మహిళల లోదుస్తులే ఈ దొంగ టార్గెట్​- ఏం చేసుకుంటాడో!

Ladies undergarments thief : మహిళల లోదుస్తులే ఈ దొంగ టార్గెట్​- ఏం చేసుకుంటాడో!

Sharath Chitturi HT Telugu

05 September 2022, 14:36 IST

    • Ladies undergarments thief : మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో.. మహిళల లోదుస్తులను దొంగలిస్తున్నాడు ఓ దొంగ. మహిళల లోదుస్తులే టార్గెట్​గా.. అర్ధరాత్రి పూట ఇళ్లల్లోకి చొరబడుతున్నాడు.
మహిళల లోదుస్తులే.. ఈ దొంగ టార్గెట్​..!
మహిళల లోదుస్తులే.. ఈ దొంగ టార్గెట్​..! (HT)

మహిళల లోదుస్తులే.. ఈ దొంగ టార్గెట్​..!

Ladies undergarments thief : సాధారణంగా దొంగలెవరైనా ఇళ్లలోకి చొరబడితే.. ఖరీదైన వస్తువులపై కన్నేస్తారు. బీరువాలు, లాకర్​లు పగలగొట్టి నోట్ల కట్టలు, విలువైన ఆభరణాలను దోచుకెళతారు. కానీ మధ్యప్రదేశ్​లోని ఓ దొంగ ‘రూటే.. సపరేటు..!’ అతడేంటో.. విచిత్రంగా ఇళ్లలోకి దూరి మహిళల లోదుస్తులను దోచుకెళుతున్నాడు.

మహిళల లోదుస్తులే టార్గెట్​..!

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తోంది. అర్ధరాత్రి పూట ఓ దొంగ ఇళ్ల మీద పడుతున్నాడు. బాల్కెనీల్లో ఆరేసిన బట్టలపై కన్నేస్తున్నాడు. వాటిని బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి జారుకుంటున్నాడు.

ఈ వ్యవహారంపై ఎవరూ నోరు విప్పడం లేదు. లోదుస్తులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏంటని.. కొందరు సిగ్గు పడుతున్నారు. మరికొందరు లోదుస్తులే కదా..! ఖరీదైన వస్తువులు కాదు కాదా! అని వదిలేస్తున్నారు.

Gwalior crime news : అయితే.. కొన్ని రోజుల క్రితమే ఆ దొంగ ఓ వ్యాపారి ఇంట్లో దూరాడు. బాల్కెనీలో ఉన్న మహిళల లోదుస్తులను తీసుకుని బ్యాగులో వేసుకున్నాడు. ఆ పక్కనే.. ఆరేసి ఉన్న ఓ పైజామాలో రూ. 500 నోటు ఒకటి కనిపిస్తే.. దానిని కూడా తన బ్యాగులో వేసుకున్నాడు. ఆ వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు.

ఆ వ్యాపారి.. పొద్దున్నే లేచి బాల్కెనీలోకి వెళ్లాడు. ఆరేసిన బట్టలు కనిపించ లేదు! లోదుస్తులు దొంగలిస్తున్న దొంగ గురించి అప్పటికే నగరం అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో తనకి కూడా అనుమానం వచ్చి.. ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాను పరిశీలించాడు.

Thief robbing undergarments : ఆ సీసీటివీ కెమెరాలో అంతా స్పష్టంగా కనిపించింది. ఓ యువకుడు.. అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. కొంత సేపటి తర్వాత.. ఓ బ్యాగుతో బయపడ్డాడు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన ఆ వ్యాపారి.. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా.. మహిళల లోదుస్తులను దొంగలిస్తున్న దొంగకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఆ దొంగ.. స్థానికంగా ఉండే ఆకాశ్​ వర్మ అని పోలీసులకు తెలిసింది. అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసు అధికారులు. కొన్ని బృందాలుగా విడిపోయి.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.

అసలు ఆకాశ్​ వర్మ ఎవరు? మహిళల లోదుస్తులను అతడు ఎందుకు దొంగలిస్తున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానం.. ఆ దొంగ దొరికిన తర్వాతే తెలుస్తుంది.

తదుపరి వ్యాసం