తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kotak Mahindra Hikes Fd Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన కోటక్

Kotak mahindra Hikes FD rate: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన కోటక్

HT Telugu Desk HT Telugu

18 August 2022, 16:18 IST

    • Kotak mahindra Hikes FD rate: ప్రైవేట్ రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు (REUTERS)

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు

ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు ఆగస్టు 17, 2022 నుండి అమలులోకి వచ్చాయని ప్రకటించింది. బ్యాంక్ చివరిగా ఆగస్ట్ 10న తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. 390 రోజుల నుంచి 3 ఏళ్ల వరకు గల కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ మళ్లీ పెంచింది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 2.50% నుండి 5.90% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.00% నుండి 6.40% వరకు ఉండే కాలపరిమితితో ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తోంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ FD రేట్లు

7 నుండి 14 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.50% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. 15 నుండి 30 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.65% వడ్డీ రేటును కొనసాగిస్తుంది.

31 నుండి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25% వడ్డీని చెల్లిస్తుంది. అలాగే 91 నుండి 179 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లకు 3.75% వడ్డీని చెల్లిస్తారు. ఇంకా కోటక్ బ్యాంక్ 364 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25% వడ్డీ రేటును కొనసాగిస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ 180 రోజుల నుండి 363 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.00% వడ్డీ రేటు అమలు చేస్తోంది. 365 రోజుల నుండి 389 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటును వర్తింపజేస్తోంది.

అయితే 390 రోజుల నుంచి 3 ఏళ్ల లోపు కాలపరిమితితో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.85% నుండి 5.90%కి వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు మూడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి (పదేళ్ల వరకు) మెచ్యూరిటీ అయ్యే వాటిపై 5.90% కొనసాగుతుంది. సీనియర్ సిటిజన్‌లు అన్ని కాల వ్యవధుల ఫిక్స్ సాధారణ రేటు కంటే 0.50% అదనపు వడ్డీ రేటు పొందుతారు.

<p>Kotak Mahindra Bank FD Rates: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పట్టిక</p>

రెండు ప్రధాన బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఆగస్ట్ 18, 2022న ప్రకటించిన సవరణ ఫలితంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వివిధ రకాల అవధులపై వడ్డీ రేట్లను 15 నుండి 40 బీపీఎస్ పాయింట్ల వరకు పెంచింది. పీఎన్‌బీ తన సవరించిన వడ్డీ రేట్లను ఆగస్టు 17, 2022న వెల్లడించింది. వివిధ రకాల అవధులపై వడ్డీ రేట్లను 20 బీపీఎస్ పాయింట్ల వరకు పెంచింది.

తదుపరి వ్యాసం