తెలుగు న్యూస్ / ఫోటో /
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందజేస్తున్న బ్యాంకులు ఇవే!
- చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను సురక్షితమైన పొదుపు విధానంగా భావిస్తారు. అయితే FDలో పెట్టుబడి సురక్షతమైనప్పటికీ డబ్బు అవసరమైనప్పుడు, రీడీమ్ చేయడం కష్టంగా ఉంటుంది. FD కంటే మెరుగైన వడ్డీ రేటు మరే ఇతర పొదుపులకు లేదు. అయితే చాలా బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.కానీ 3 ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఎఫ్‌డిలా రిటర్న్‌లపై 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కాబట్టి నగదు పొదుపు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల గురించి వివరంగా తెలుసుకోండి.

(1 / 4)
DCB బ్యాంక్ - DCB బ్యాంక్ ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులలో పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు పొదుపు ఖాతాపై రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల పొదుపుపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే, డిసాజిట్ చేసే డబ్బు తక్కువగా ఉంటే, మీకు తక్కువ వడ్డీ లభిస్తుంది. రూ.1 లక్షకు వడ్డీ 2.5 శాతం, 2 లక్షలకు వడ్డీ రేటు 4.5 శాతం, 2 నుండి 10 లక్షల మధ్య వడ్డీ రేటు 5 శాతం. 10-25 లక్షల వరకు 6.25 , 25 నుంచి 50 లక్ష డిపాజిట్లపై 5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
(2 / 4)
RBL బ్యాంక్ - పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల జాబితాలో RBL బ్యాంక్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ డిపాజిటర్లు రూ. 10 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఉన్న బ్యాలెన్స్‌పై గరిష్టంగా 7.25 శాతం వడ్డీని పొందవచ్చు. RBL బ్యాంక్‌లో, రూ. లక్షపై 4.25 శాతం, రూ. 1-10 లక్షల వరకు 5.5 శాతం వడ్డీ లభిస్తుంది.
(3 / 4)
బంధన్ బ్యాంక్ - అధిక వడ్డీ కావాలంటే.. బంధన్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో కూడా డబ్బు జమ చేయవచ్చు. ఇక్కడ గరిష్టంగా 6 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. మీ ఖాతాలో 10 లక్షల నుండి 2 కోట్ల రూపాయలు ఉంటే, మీకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 1 లక్ష వరకు 3% వడ్డీని.. రూ. 1-10 లక్షల వరకు 5% వడ్డీని పొందుతారు.
ఇతర గ్యాలరీలు