తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kheer Bhawani : కశ్మీరీ పండిట్లు, ముస్లింలు కలిసి జరుపుకొన్న పండగ

Kheer bhawani : కశ్మీరీ పండిట్లు, ముస్లింలు కలిసి జరుపుకొన్న పండగ

HT Telugu Desk HT Telugu

09 June 2022, 10:46 IST

    • ఓవైపు రాజకీయ నేతలు హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రేపుతుంటే మరోవైపు కశ్మీరీ పండిట్లు, ముస్లింలు కలిసి ఖీర్ భవానీ పండగ జరుపుకొన్నారు.
ఖీర్ భవానీ ఆలయం వద్ద ఉన్న పవిత్ర చెరువులో భక్తులు పాలు పోస్తున్నారు. కాశ్మీర్‌లో ఇటీవలి హత్యల నేపథ్యంలో, బుధవారం తక్కువ సంఖ్యలో యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు.
ఖీర్ భవానీ ఆలయం వద్ద ఉన్న పవిత్ర చెరువులో భక్తులు పాలు పోస్తున్నారు. కాశ్మీర్‌లో ఇటీవలి హత్యల నేపథ్యంలో, బుధవారం తక్కువ సంఖ్యలో యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు. (HT_PRINT)

ఖీర్ భవానీ ఆలయం వద్ద ఉన్న పవిత్ర చెరువులో భక్తులు పాలు పోస్తున్నారు. కాశ్మీర్‌లో ఇటీవలి హత్యల నేపథ్యంలో, బుధవారం తక్కువ సంఖ్యలో యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు.

గందర్‌బాల్ (జమ్మూ కాశ్మీర్), జూన్ 9: నిజమైన 'కాశ్మీరియత్'కి ఉదాహరణగా, కాశ్మీరీ పండిట్లు జమ్మూ, కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో ఖీర్ భవాని పండుగను జరుపుకున్నారు. కశ్మీర్ లోయలో శాంతి కోసం ప్రార్థించారు. వారి వేడుకలో ముస్లిం సమాజం వారితో కలిసి వచ్చింది.

జ్యేష్టాష్టమి సందర్భంగా ఏటా ఖీర్ భవానీ మేళా జరుపుకొంటారు. కశ్మీరీ పండిట్లు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అయితే లోయలో ఇటీవల హత్యలు జరగడంతో ఉత్సవాలపై నీలినీడలు కమ్ముకుని భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు.

లోయలోని పండిట్ సమాజం, ముస్లింల మధ్య సోదరభావం వ్యాప్తి చేయడానికి ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ముస్లింలు పండుగ సమయంలో పండిట్ల కుటుంబాలకు సహాయం అందించడానికి, వారికి నైతిక మద్దతు అందించడానికి ముందుకు వస్తారు.

కాశ్మీరీ పండిట్ డాక్టర్ సందీప్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘మా పూర్వీకుల సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి మేం ఇక్కడికి వచ్చాం. మా సొంత లోయకు తిరిగి వచ్చి మా ముస్లిం, సిక్కు సోదరులను కలవడం గర్వించదగ్గ క్షణం. భగవంతుని ఆశీస్సులు మేం కోరుకుంటున్నాం. భయాందోళన వాతావరణం నెలకొనడంతో గతంలో కంటే ఈసారి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, అన్ని ప్రాంతాలు శాంతియుతంగా జీవించాలని పాకిస్తాన్ కోరుకోవడం లేదు..’ అని అన్నారు.

<p>బుధవారం జమ్మూలోని ఖీర్ భవానీ ఆలయంలో వార్షిక ఖీర్ భవానీ మేళా సందర్భంగా కాశ్మీరీ పండిట్ల పూజలు</p>

‘ఖీర్ భవానీ మందిర్ కాశ్మీరీ పండిట్‌లకు పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. నాతో పాటు ముస్లింలు కూడా ఇక్కడకు వచ్చారు..’ అని అన్నారు.

‘అసలైన కాశ్మీరియత్’ ఇక్కడ కనిపిస్తోందని తన పండిట్ స్నేహితుడితో కలిసి వచ్చిన ముస్లిం వ్యక్తి డాక్టర్ రిజ్వాన్ చెప్పారు.

‘ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. అసలైన కశ్మీరియత్ ఇక్కడ కనిపిస్తుంది. మేం చాలా కాలంగా ఉగ్రవాదాన్ని చూశాం. ఇటీవలి కాలంలో జరిగిన హత్యల కారణంగా ఎక్కువ మంది ప్రజలు రాకపోవడం దురదృష్టకరం. వీటికి భయపడి వారి నీచమైన వ్యూహాలను విజయవంతం చేయవద్దని నా హిందూ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రిజ్వాన్ అన్నారు.

లోయలో శాంతి నెలకొనాలని మాత్రమే తాము ప్రార్థించామని ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వచ్చిన భక్తురాలు డైసీ భట్ తెలిపారు.

‘ఇక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత మేం చక్కటి అనుభూతి చెందుతున్నాం. ఇక్కడ శాంతి కోసం మేం ప్రార్థిస్తున్నాం. తద్వారా మేమందరం ఇక్కడ సంతోషంగా జీవించగలం..’ అని ఆమె చెప్పారు.

వేదిక వద్ద వాటర్ స్టాల్ ఏర్పాటు చేసిన మరో ముస్లిం వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఇది మన సంప్రదాయం. మన సోదరభావం. ముస్లింలు, పండితులు కలిసిమెలిసి జీవిస్తున్నాం. మేం కలిసి పెరిగాం..’ అని వ్యాఖ్యానించారు.

‘కశ్మీరీ పండిట్లు మేం లేకుండా అసంపూర్ణం. మేం ఎల్లప్పుడూ వారితో ఉంటాం. మేం సోదరులం. వారు లేకుండా కాశ్మీర్ అసంపూర్తిగా ఉంటుంది. మేం ఇంతకుముందు ఎలా జీవించామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాం.. ’ అని అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం