తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  77% Reservations In Jharkhand: జార్ఖండ్ లో ఇక 77% రిజర్వేషన్లు!

77% reservations in Jharkhand: జార్ఖండ్ లో ఇక 77% రిజర్వేషన్లు!

HT Telugu Desk HT Telugu

11 November 2022, 15:39 IST

  • 77% reservations in Jharkhand: రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ అసెంబ్లీ శుక్రవారం ఒక బిల్లును ఆమోదించింది. 

అసెంబ్లీలో మాట్లాడుతున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్
అసెంబ్లీలో మాట్లాడుతున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ (PTI)

అసెంబ్లీలో మాట్లాడుతున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్

77% reservations in Jharkhand: వివిధ కేటగిరీలకు ఇచ్చే రిజర్వేషన్లను 77 శాాతానికి పెంచుతూ ప్రతిపాదించిన బిల్లును జార్ఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంలో ఈ బిల్లును ఆమోదించారు. ఈ రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని రాష్ట్ర ప్రజలకు సురక్ష కవచంగా ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభివర్ణించారు.

77% reservations in Jharkhand: ప్రస్తుతం 60%.. ఇకపై 77%

శుక్రవారం జరిగిన ప్రత్యేక భేటీలో జార్ఖండ్ అసెంబ్లీ జార్ఖండ్ రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్స్ అండ్ సర్వీసెస్ చట్టం, 2011(Jharkhand Reservation of Vacancies in Posts and Services Act, 2001) కు సవరణ చేస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా బలహీన వర్గాలు- EWS)లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 60% రిజర్వేషన్లు 77శాతానికి పెరుగుతాయి. ఈ మేరకు రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో సవరణలు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

77% reservations in Jharkhand: వర్గాల వారీగా..

ఈ బిల్లులోని ప్రతిపాదిత రిజర్వేషన్లు ఇలా ఉండబోతున్నాయి. ఎస్సీలకు(SC) 12%, ఎస్టీలకు(ST) 28%, అత్యంత వెనుకబడిన వర్గాలకు(EBCs) 15%, ఇతర వెనుకబడిన వర్గాలకు(OBC) 12%, పైన పేర్కొన్న వారు కాకుండా ఇతరుల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు(EWS) 10% రిజర్వేషన్లు లభిస్తాయి. ప్రస్తుతం ఎస్టీలకు 26%, ఎస్సీలకు 10%, ఓబీసీలకు 14% రిజర్వేషన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలు, అధికార జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి సహా, రిజర్వేషన్ల పెంపుపై హామీ ఇచ్చాయి.

తదుపరి వ్యాసం