తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main Result 2024: ఫైనల్ ఆన్సర్ కీ నుంచి 6 ప్రశ్నల తొలగింపు.. వీటికి మార్కులు ఇస్తారా?

JEE Main Result 2024: ఫైనల్ ఆన్సర్ కీ నుంచి 6 ప్రశ్నల తొలగింపు.. వీటికి మార్కులు ఇస్తారా?

HT Telugu Desk HT Telugu

12 February 2024, 16:15 IST

    • జేఈఈ మెయిన్స్ 2024 పరీక్ష ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. కాగా ఫైనల్ ఆన్సర్ కీ నుంచి 6 ప్రశ్నలను తొలగించారు.
JEE Main Result: ఫైనల్ ఆన్సర్ కీ నుంచి 6 ప్రశ్నల తొలగింపు
JEE Main Result: ఫైనల్ ఆన్సర్ కీ నుంచి 6 ప్రశ్నల తొలగింపు (Shutterstock)

JEE Main Result: ఫైనల్ ఆన్సర్ కీ నుంచి 6 ప్రశ్నల తొలగింపు

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 సెషన్ 1, పేపర్ 1 పరీక్ష తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు ఈ రోజు jeemain.nta.ac.in వెలువడే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

జేఈఈ మెయిన్ 2024 బీఈ/బీటెక్ పేపర్ల ఫైనల్ ఆన్సర్ కీ నుంచి తొలగించిన ప్రశ్నలు ఇవే

జనవరి 27, షిఫ్ట్ 2: క్వశ్చన్ ఐడీ 533543501 (ఫిజిక్స్)

జనవరి 29, షిఫ్ట్ 1: క్వశ్చన్ ఐడీ 405859872 (ఫిజిక్స్)

జనవరి 30, షిఫ్ట్ 2: క్వశ్చన్ ఐడీ 4058591019 (మ్యాథమెటిక్స్)

జనవరి 31, షిఫ్ట్ 2: క్వశ్చన్ ఐడీ 4058591228 (ఫిజిక్స్)

ఫిబ్రవరి 1, షిఫ్ట్ 2: క్వశ్చన్ ఐడీ 9561771218 (మ్యాథమెటిక్స్)

ఫిబ్రవరి 1, షిఫ్ట్ 2: క్వశ్చన్ ఐడీ 9561771227 (మ్యాథమెటిక్స్)

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విధానం ప్రకారం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు (ఎంసీక్యూలు) తుది సమాధాన కీ నుంచి ఒక ప్రశ్నను తొలగించినప్పుడు, లేదా ఒక ప్రశ్న తప్పుగా తేలినప్పుడు, ప్రశ్నకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా అభ్యర్థులందరికీ పూర్తి మార్కులు ఇస్తారు.

అయితే న్యూమరికల్ ప్రశ్నలకు ఒక ప్రశ్నను తొలగించినప్పుడు ఆ ప్రశ్నను ప్రయత్నించిన వారికి మాత్రమే పూర్తి మార్కులు (+4) ఇస్తారు.

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ కీని ఇక్కడ చూడండి.

జేఈఈ మెయిన్ 2024 మొదటి సెషన్‌ను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఎన్టీఏ నిర్వహించింది. ఫైనల్ ఆన్సర్ కీ విడుదల కావడంతో అభ్యర్థులు త్వరలోనే ఫలితాలను ఆశించవచ్చు. ఫలితాలు jeemain.nta.ac.in, ntaresults.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

తదుపరి వ్యాసం