తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Same-sex Marriage : సేమ్-సెక్స్ మ్యారేజ్ నిషేధం రాజ్యాంగబద్ధమే..

same-sex marriage : సేమ్-సెక్స్ మ్యారేజ్ నిషేధం రాజ్యాంగబద్ధమే..

HT Telugu Desk HT Telugu

21 June 2022, 11:14 IST

    • సేమ్-సెక్స్ మ్యారేజ్‌పై నిషేధం విధించడం రాజ్యాంగబద్ధమేనని జపాన్ కోర్టు ఒకటి తీర్పు ఇచ్చింది.
ఒసాకా కోర్టు ముందు జర్నలిస్టులతో మాట్లాడుతున్న పిటిషనర్లు
ఒసాకా కోర్టు ముందు జర్నలిస్టులతో మాట్లాడుతున్న పిటిషనర్లు (AP)

ఒసాకా కోర్టు ముందు జర్నలిస్టులతో మాట్లాడుతున్న పిటిషనర్లు

టోక్యో, జూన్ 21: సేమ్ సెక్స్ మ్యారేజ్‌‌పై దేశంలో నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం కాదని జపాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. తాము కలిసి ఉండే హక్కుకు, సమానత్వపు హక్కుకు భంగం కలిగిందని, అందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మూడు జంటలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ట్రెండింగ్ వార్తలు

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

Weather update : ఇంకొన్ని రోజుల పాటు ఎండల నుంచి ఉపశమనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

గతంలో సపోరో కోర్టు ఈ సేమ్-సెక్స్ మ్యారేజ్ నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని ఇచ్చిన తీర్పును ఈ ఒసాకా జిల్లా కోర్టు అంగీకరించలేదు. భారీగా పారిశ్రామీకరణ జరిగినే 7 పెద్ద దేశాల్లోని బృందంలో జపాన్ ఒక్క దేశంలో మాత్రమే సేమ్ సెక్స్ మ్యారేజ్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఈ రెండు తీర్పుల ద్వారా అర్థమవుతోంది.

తాము ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా 1 మిలియన్ యెన్‌ (7,400 అమెరికన్ డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఒసాకా కోర్టు కొట్టివేసింది.

రెండు మగ జంటలు, ఒక ఆడ జంట ఈ కేసు దాఖలు చేశాయి. 2019లో సపోరో, టోక్యో, నాగోయ, ఫుకుఒక, ఒసాకా తదితర ఐదు పెద్ద నగరాల్లో మొత్తం 14 జంటలు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేశాయి. 

భిన్న లింగానికి చెందిన జంటలు (మగ-ఆడ) పొందుతున్న ఆర్థిక, చట్టబద్ధమైన ప్రయోజనాలను తాము పొందలేకపోతున్నామని, వివక్షకు గురవుతున్నామని ఆయా పిటిషనర్లు వాదించారు. 

సెక్సువల్ డైవర్సిటీకి జపాన్‌లో క్రమంగా మద్ధతు పోతోంది. అయితే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు చట్టబద్ధమైన రక్షణ లభించడం లేదు. ఎల్జీబీటీక్యూ వ్యక్తులు తరచుగా వివక్షకు గురవుతున్నారు. పాఠశాలలు, విద్యా సంస్థలు, వర్క్ ప్లేస్, ఇల్లు.. తదితర చోట్ల వివక్ష ఎదురవడంతో వారు తమ సెక్సువల్ ఐడెంటిటీని దాచిపెడుతున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం దృష్టి జపాన్‌పై ఉన్న వేళలో అక్కడి హక్కుల బృందాలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈక్వాలిటీ యాక్ట్‌ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయితే ఆ బిల్లును కన్జర్వేటివ్ గవర్నింగ్ పార్టీ తోసిపుచ్చింది.

1947 రాజ్యాంగంలో మగ, ఆడ వ్యక్తులు మాత్రమే వివాహం చేసుకునేందుకు స్వేచ్ఛ ఉందని, అందులో సేమ్ సెక్స్ గల వ్యక్తులను చేర్చలేదని ఒసాకా కోర్టు సోమవారం స్పష్టం చేసింది. అందువల్ల సేమ్-సెక్స్ మ్యారేజెస్‌ను బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేసింది.

భిన్న లింగ వివాహం అనేది పిల్లలను కనేందుకు, స్రీ, పురుషుల మధ్య సంబంధం రక్షించేందుకు సమాజం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అని, సేమ్-సెక్స్ రిలేషన్‌షిప్స్ ఇంకా బహిరంగ చర్చ దశలో ఉన్నాయని న్యాయమూర్తి ఫ్యూమీ డోయ్ అన్నారు.

సేమ్-సెక్స్ రిలేషన్‌షిప్స్‌ను రక్షించేందుకు ఉత్తమ పద్ధతులను కనిపెట్టేలా, సేమ్-సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత తేవడమనే ఆప్షన్ సహా పార్లమెంటు తగిన మార్గాలు ఆలోచించాలని కోర్టు సిఫారసు చేసింది.

ఈక్వాలిటీ బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకున్న ఎల్జీబీటీక్యూ హక్కుల కార్యకర్తలకు జపాన్ కోర్టు ఇచ్చిన తీర్పు నిరాశ కలిగించింది. అయితే ఈ తీర్పుపై అప్పీలుకు వెళతామని న్యాయవాదులు ప్రకటించారు.

కాగా ప్రస్తుతం జపాన్‌లో సేమ్-సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం సేమ్-సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే పరస్పరం ఆస్తులు పొందే వెసులుబాటు, పేరెంటల్ రైట్స్ గానీ ఉండవు. ఇరువురు కలిసి ఉండేందుకు అద్దె ఇల్లు దొరకదు. హాస్పిటల్ విజిట్స్, ఇతర సేవలు కేవలం పెళ్లయిన భిన్న లింగ జంటలకే లభిస్తాయి.

అయితే 2015లో టోక్యోలోని షిబుయ కోర్టు ఆదేశాల మేరకు జపాన్‌లోని 200 మున్సిపాలిటీల్లో సేమ్-సెక్స్ జంటలకు పార్ట్‌నర్‌షిప్ సర్టిఫికెట్ (నాన్-లీగల్లీ బైండింగ్) జారీచేస్తున్నారు.

టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ కూడా ఇటీవలికాలంలో సేమ్-సెక్స్ జంటలకు పార్ట్‌నర్‌షిప్ సర్టిఫికెట్లు జారీచేస్తోంది.

అయితే ఇది మ్యారేజ్ సర్టిఫికెట్ కాదు. ఇది ఈక్వల్ లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వదు. అయితే తైవాన్‌ దేశం సేమ్-సెక్స్ మ్యారేజ్‌కు చట్టబద్ధమైన అనుమతి ఇస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం