తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Irctc : టికెట్ బుకింగ్ సంఖ్యా పరిమితి పెంచిన ఐఆర్సీటీసీ

IRCTC : టికెట్ బుకింగ్ సంఖ్యా పరిమితి పెంచిన ఐఆర్సీటీసీ

HT Telugu Desk HT Telugu

06 June 2022, 14:46 IST

    • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా గానీ.. ఆధార్ లింక్ చేసుకున్న ఒక్కో యూజర్ నెలకు గరిష్టంగా 12 టికెట్లు, ఆధార్ లింక్ చేసుకోని యూజర్ గరిష్టంగా 6 టికెట్లు బుక్ చేసుకునే వెసులు బాటు ఉంది.
ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ల బుకింగ్ పరిమితి పెంచిన భారతీయ రైల్వే
ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ల బుకింగ్ పరిమితి పెంచిన భారతీయ రైల్వే (HT_PRINT)

ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ల బుకింగ్ పరిమితి పెంచిన భారతీయ రైల్వే

ఆధార్ అనుసంధానం లేని యూజర్ గరిష్ట పరిమితిని 6 టికెట్ల నుంచి 12 టికెట్లకు పెంచుతూ భారతీయ రైల్వే సోమవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆధార్‌తో యూజర్ ఐడీ అనుసంధానం చేసి ఉంటే ఇప్పుడున్న గరిష్ట పరిమితిని 12 నుంచి 24 టికెట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

ఐఆర్సీటీసీ అకౌంట్‌కు ఆధార్ ఎలా లింక్ చేయాలి?

ఆధార్‌తో అనుసంధానం చేసుకుంటే గరిష్టంగా నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఈ ప్రక్రియను అనుసరించాలి.

ఐఆర్సీటీసీ రిజిస్టర్డ్ యూజర్ ప్రొఫైల్ సెక్షన్‌లోని కేవైసీ ఆప్షన్ ఆధారంగా వెరిఫై చేసుకోవాలి.

ఆధార్ నెంబర్‌తో లింకై ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ పంపడం ద్వారా ఐఆర్సీటీసీ ఖాతా యూజర్‌ను ధ్రువీకరిస్తుంది.

ఒక నెలలో ఆరు టికెట్ల కంటే ఎక్కువసార్లు బుక్ చేసుకున్నప్పుడు.. యూజర్ బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణించే వారిలో కనీసం ఒక్కరైనా ఆధార్ వెరిఫై చేసుకుని ఉండాలి.

ఐఆర్సీటీసీ యూజర్లు ప్రతిపాదిత ప్రయాణికుల వివరాలను వారి వారి ఆధార్ నెంబర్లతో సహా ప్యాసింజర్ మాస్టర్ లిస్ట్‌లో నమోదు చేయాలి. ఒకవేళ ఆరు టికెట్ల కంటే ఎక్కువగా ఒక నెలలో బుక్ చేసినప్పుడు ఈ ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి.

ఆధార్ ద్వారా ధ్రువీకరణ పొందిన ప్యాసింజర్ వివరాలు మాస్టర్ లిస్ట్‌లో నమోదయ్యకా.. టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తే ఆ వివరాల నుంచి నేరుగా యాడ్ చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం