తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Southwest Monsoon : ఈసారి.. 5ఏళ్లల్లోనే అతి తక్కువ వర్షపాతం- అదే కారణం!

Southwest monsoon : ఈసారి.. 5ఏళ్లల్లోనే అతి తక్కువ వర్షపాతం- అదే కారణం!

Sharath Chitturi HT Telugu

02 October 2023, 12:51 IST

    • Southwest monsoon : నైరుతి రుతుపవనాలు.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోనున్నాయి. కాగా.. ఈసారి తక్కువ వర్షాలే పడ్డాయని ఐఎండీ తెలిపింది.
ఇంకొన్ని రోజుల్లో రుతుపవనాల ఉపసంహరణ- ఈసారి 5ఏళ్లల్లోనే అతి తక్కువ వర్షపాతం!
ఇంకొన్ని రోజుల్లో రుతుపవనాల ఉపసంహరణ- ఈసారి 5ఏళ్లల్లోనే అతి తక్కువ వర్షపాతం! (HT_PRINT)

ఇంకొన్ని రోజుల్లో రుతుపవనాల ఉపసంహరణ- ఈసారి 5ఏళ్లల్లోనే అతి తక్కువ వర్షపాతం!

Southwest monsoon exit : నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో పూర్తికానుంది. ఈ ఏడాది జూన్​లో కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రస్తుతం తిరుగుప్రయాణంలో ఉన్నాయి. కాగా.. 2018 నుంచి చూస్తే.. ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్​ నీనో ఇందుకు కారణం. ఈ వివరాలను భారత వాతావరణశాఖ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

అక్టోబర్​ మొదటి వారం పూర్తయ్యే సరికి.. నైరుతి రుతుపవనాలు దేశాన్ని విడిచిపెడతాయని ఐఎండీ తెలిపింది. ఈసారి వర్షాలు సరిగ్గా పడలేదని పేర్కొంది. ఆగస్ట్​లో అసలు వర్షాలే లేవని, శతాబ్ద కాలంలో ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు లెక్కిస్తే.. ఎల్​పీఏ (లాంగ్​ పీరియడ్​ యావరేజ్​)లో 94శాతం వర్షపాతమే నమోదైందని, ఇది 2018 నుంచి కనిష్ఠ స్థాయి అని వివరించింది.

Southwest monsoon 2023 : దేశవ్యాప్తంగా ఈసారి జూన్​లో.. సాధారణం కన్నా 9శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జులైలో సాధారణం కన్నా 13శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఆగస్ట్​లో 36శాతం లోటు నమోదైంది. సెప్టెంబర్​లో సాధారణం కన్నా 13శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి.

ఇక ఈ వారం చివరి నాటికి నైరుతి రుతుపవనాలు దేశాన్ని విడిచిపెడుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

తూర్పు భారతం:- పశ్చిమ్​ బెంగాల్​లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, ఝార్ఖండ్​, బిహార్​, ఒడిశాల్లో​ ఈ నెల 5 వరకు వర్షాలు పడతాయి.

Rains in India : ఈశాన్య భారతం:- ఈ నెల 5 వరకు.. నాగాలాండ్​, మణిపూర్​, మిజోరం, త్రిపుర, అరుణాచల్​ ప్రదేశ్​​లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదవుతుంది.

పశ్చిమ భారతం:- మహారాష్ట్ర, గోవా, దక్షిణ కోంకణ్​ ప్రాంతాల్లో సోమవారం నుంచి వర్షాలు పడతాయి. గోవాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Telangana Rains : మధ్య భారతం:- ఛత్తీస్​గఢ్​లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.

దక్షిణ భారతం:- కేరళలో సోమవారం తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఇతర రాష్ట్రాలకు పెద్దగా వర్ష సూచన లేదు.

తదుపరి వ్యాసం