తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'బేబీ బెర్త్​'.. పసిబిడ్డల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు!

'బేబీ బెర్త్​'.. పసిబిడ్డల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు!

HT Telugu Desk HT Telugu

10 May 2022, 11:14 IST

    • రైలు ప్రయాణాల్లో తల్లులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న పిల్లలతో కలిసి బెర్త్​లో పడుకోవాల్సి వస్తుంది. దీనికి చెక్​ పెట్టి, తల్లులు మరింత సౌకర్యంగా ప్రయాణించేందుకు 'బేబీ బేర్త్​'ను ప్రయోగించింది భారతీయ రైల్వే. ఆ వివరాలు..
బేబీ బెర్త్​.. సూపర్​ ఐడియా!
బేబీ బెర్త్​.. సూపర్​ ఐడియా! (twitter)

బేబీ బెర్త్​.. సూపర్​ ఐడియా!

Baby berth Indian railway | పసిబిడ్డలు, చిన్న పిల్లలతో ప్రయాణం అంత సులభం కాదు. ముఖ్యంగా రైళ్లల్లో తల్లుల పక్కనే వారు పడుకోవాల్సి వస్తుంది. ఫలితంగా తల్లులు ప్రయాణం మొత్తం మీద తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉంటారు. తాజాగా.. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు భారతీయ రైల్వే ఓ వినూత్న ఆలోచనను అమలుచేసింది. లోయర్​ బెర్త్​ పక్కనే ఓ 'బేబీ బెర్త్​'ను ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

Weather update : ఇంకొన్ని రోజుల పాటు ఎండల నుంచి ఉపశమనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

UGC NET June 2024: యూజీసీ నెట్ కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజులు పొడిగింపు

'వాట్​ ఆన్​ ఐడియా సర్జీ..'

ప్రయాణికుల సౌకర్యం కోసమే ఈ ప్రత్యేక బెర్త్​ను తీసుకొచ్చింది భారతీయ రైల్వేకు చెందిన లక్నో డివిజన్​(నార్త్​ జోన్)​. దీనిని బేబీ బెర్త్​గా పిలుస్తున్నారు. ఏర్పాట్లను చూస్తే.. చిన్న పిల్లలు కిందకి పడిపోతారేమో అన్న భయం కూడా ఉండదు. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. బేబీ బెర్త్​కు స్టాపర్​లను ఫిక్స్​ చేశారు.

"లక్నో మెయిల్​ 194129లోని బీ4 కోచ్​లో 12,60లో బేబీ బెర్త్​ను ఏర్పాటు చేశాము. తల్లులు తమ పిల్లలను బేబీ బెర్త్​లో పెట్టుకోవచ్చు. ప్రయాణం వేళ వారికి సౌకర్యంగా ఉంటుంది. అవసరం లేనప్పుడు.. ఆ బేబీ బెర్త్​ను ఫోల్డ్​ కూడా చేసుకోవచ్చు," అని నార్త్​ జోన్​లోని లక్నో డివిజన్​కు చెందిన డీఆర్​ఎం ట్వీట్​ చేశారు.

ఫోల్డ్​ చేయడంతో పాటు.. బేబీ బెర్త్​ హైట్​ను కూడా ప్రయాణికులకు అనుగుణంగా మార్చుకోవచ్చు! లోయర్​ సీట్లకు మాత్రమే ఈ బేబీ బెర్త్​ ఉంటుంది.

ప్రస్తుతం ప్రయోగంలో భాగంగా ఒక కోచ్​కే ఈ బేబీ బెర్త్​ను జోడించారు. ప్రయాణికుల ఫీడ్​బ్యాక్​ తీసుకుని, ప్రయోగం సక్సెస్​ అయితే.. మరిన్ని కోచ్​లలో ఈ బేబీ బెర్త్​లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం