తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral : ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు.. పోలీసులే షాక్​!

Viral : ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు.. పోలీసులే షాక్​!

Sharath Chitturi HT Telugu

11 July 2022, 14:18 IST

    • Viral : ఆటో డ్రైవర్లు డబ్బుకు ఆశపడి ఎక్కువమందిని ఎక్కించుకోవడం సాధారణ విషయమే. కానీ ఓ డ్రైవర్​.. 27మంది ప్రయాణికులతో బండి నడిపితే? ఈ షాకింగ్​ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది.
ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు.. పోలీసులే షాక్​!
ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు.. పోలీసులే షాక్​! (Twitter)

ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు.. పోలీసులే షాక్​!

Viral : సాధారణంగా ఆటోలో ముగ్గురు పడతారు. 7 సీటర్​ అయితే ఏడుగురు ప్రయాణించవచ్చు. కానీ ఆటో డ్రైవర్లు.. ఒక్కోసారి సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకుంటారు. ఇదంతా సాధారణ విషయమే. కానీ ఒక ఆటోలో.. ఏకంగా 27మంది ప్రయాణిస్తే? నోరెళ్లబెట్టే ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఇది చూసి పోలీసులే షాక్​ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

ఫాతేహ్​పూర్​లో ఆదివారం వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. బిండ్కి కోత్వాలా ప్రాంతంలో ఆ ఆటో వేగంగా దూసుకెళుతుండటాన్ని గమనించిన పోలీసులు.. దానిని వెంబడించారు. చివరికి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్యాసింజర్లను కిందకి దింపడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిని లెక్కేసుకుంటూ వెళ్లారు. చిన్నా, పెద్దా.. అందరిని కలుపుకుని.. ఆ ఆటోలో నుంచి ఏకంగా 27మంది బయటకొచ్చారు. మొత్తం డ్రైవర్​ను కలుపుకుంటే.. ఆ ఆటోలో 28మంది ఉన్నట్టు.

ప్రయాణికుల సంఖ్యను లెక్కపెడుతున్నప్పుడు.. పోలీసులే షాక్​ అయ్యారు. వెంటనే ఆటోను సీజ్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఈ విషయంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను విస్మరించి ఆటోను నడపటం సరికాదు అని అంటున్నారు. డబ్బులకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కామెంట్లు పెడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

తదుపరి వ్యాసం