తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Icici Hikes Rates: వడ్డీ రేట్లు పెంచేసిన ఐసీఐసీఐ బ్యాంకు.. 0.5 శాతం పెంపు

ICICI hikes Rates: వడ్డీ రేట్లు పెంచేసిన ఐసీఐసీఐ బ్యాంకు.. 0.5 శాతం పెంపు

HT Telugu Desk HT Telugu

09 June 2022, 11:24 IST

    • ఐసీఐసీఐ బ్యాంకు తన వడ్డీ రేట్లను పెంచేసింది. ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచింది.
వడ్డీ రేట్లను పెంచేసిన ఐసీఐసీఐ (ప్రతీకాత్మక చిత్రం)
వడ్డీ రేట్లను పెంచేసిన ఐసీఐసీఐ (ప్రతీకాత్మక చిత్రం) (Deepak Salvi)

వడ్డీ రేట్లను పెంచేసిన ఐసీఐసీఐ (ప్రతీకాత్మక చిత్రం)

ఐసీఐఐసీ బ్యాంక్ తన వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. సంవత్సరానికి 8.60 శాతానికి పెంచింది. జూన్ 8 నుంచే ఇది అమల్లోకి వస్తుంది. బుధవారం మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన వెంటనే ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు మే 4, జూన్ 8 తేదీల్లో వరుసగా 0.40 శాతం, 0.50 శాతం మేర వడ్డీ రేట్లను పెంచేసింది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

ఐసీఐసీఐ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం ‘ఆర్బీఐ పాలసీ రెపో రేటు జూన్ 8, 2022 నుండి 4.90 శాతంగా అమలులోకి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఐ-ఈబీఎల్ఆర్) ఆర్‌బీఐ పాలసీ రెపో రేటును ప్రతిబింబిస్తుంది. ఐ-ఈబీఎల్ఆర్ 8.60 శాతంగా ఉంటుంది. జూన్ 8, 2022 నుండి ఇది అమలులోకి వస్తుంది..’ అని తెలిపింది. ఈబీఎల్ఆర్ అంటే.. అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి బ్యాంకుకు అనుమతి లేదని అర్థం.

ఈబీఎల్ఆర్ చివరగా మే 5న 40 బేసిస్ పాయింట్లు పెరిగి 8.10 శాతానికి చేరుకుంది. మే 4న సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 4.40 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ కూడా పెంచింది.

కాగా ఐసీఐసీఐ జూన్ 1, 2022 నుండి నిధుల ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేట్లను కూడా పెంచింది. ఒక రోజు, ఒక నెల, మూడు నెలల కాల వ్యవధిలో రుణాల కోసం ఎంసీఎల్ఆర్ 7.30 శాతం, 7.35 శాతంగా ఉన్నాయి. ఆరు నెలలు, ఒక సంవత్సరం కాలవ్యవధికి రుణ రేట్లు వరుసగా 7.50 శాతం, 7.55 శాతంగా ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం