తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Pradesh: హిమాచల్‍లో సీఎం సీట్‍పై ఉత్కంఠ.. నేడే కాంగ్రెస్ కీలక సమావేశం

Himachal Pradesh: హిమాచల్‍లో సీఎం సీట్‍పై ఉత్కంఠ.. నేడే కాంగ్రెస్ కీలక సమావేశం

09 December 2022, 13:56 IST

    • Himachal Pradesh Congress MLAs Meet: హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. రేసులో ఆరుగురి వరకు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేడు సమావేశం నిర్వహించనుంది. సీఎం ఎవరో తేల్చనుంది.
Himachal Pradesh: హిమాచల్‍లో సీఎం సీట్‍పై ఉత్కంఠ.. నేడే కాంగ్రెస్ కీలక సమావేశం
Himachal Pradesh: హిమాచల్‍లో సీఎం సీట్‍పై ఉత్కంఠ.. నేడే కాంగ్రెస్ కీలక సమావేశం (PTI)

Himachal Pradesh: హిమాచల్‍లో సీఎం సీట్‍పై ఉత్కంఠ.. నేడే కాంగ్రెస్ కీలక సమావేశం

Himachal Pradesh Congress MLAs Meet: హిమాచల్ ప్రదేశ్‍ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తంగా 40 సీట్లను దక్కించుకొని అధికారం చేపట్టేందుకు కసరత్తులను చేసుకుంటోంది. అయితే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్న విషయం మాత్రం ఉత్కంఠగా మారింది. ఎందుకంటే సీఎం సీటు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరిని సీఎంను చేసినా ఎమ్మేల్యేలో అసంతృప్తి వ్యక్తం కాకుండా హస్తం పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అందుకే హిమాచల్‍లో ఎన్నికైన ఎమ్మేల్యేలతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. చత్తీస్‍ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‍, సీనియర్ నేత భూపేందర్ హుడాతో పాటు మరికొందరు కాంగ్రెస్ ముఖ్యుల సమక్షంలో సిమ్లాలోని కార్యాలయంలో ఈ సమావేశంలో జరగనుంది. హిమాచల్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

సీఎంలో రేసులో ప్రధానంగా ఈమె

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్ (Pratibha Singh) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. హిమాచల్‍లో మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ అగ్రనేతగా ఉంటూ గత సంవత్సరం మరణించిన వీరభద్ర సింగ్ భార్య ఆమె. ప్రస్తుతం మండి నుంచి ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకున్నా.. ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ముఖ్యమంత్రి స్థానం ఆశిస్తున్నాననేలా ఆమె మాట్లాడారు. తన తల్లి ప్రతిభకు పెద్ద బాధ్యత అప్పగించాలని తాను కోరుకుంటున్నట్టు ఆమె కుమారుడు, షిమ్లా రూరల్ నుంచి ఎన్నికైన విక్రమాదిత్య సింగ్ అన్నారు. అంటే ప్రతిభకు సీఎం పదవి ఇవ్వాలనేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు.

మరికొంత మంది..

Himachal Pradesh CM Race: హిమాచల్ ప్రదేశ్ సీఎం కుర్చీ కోసం మరికొంత మంది కూడా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ఆ రాష్ట్ర మాజీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu), సీఎల్‍పీ లీడర్ ముకేశ్ అగ్నిహోత్రి (Mukesh Agnihotri), హర్షవర్ధన్ చౌహాన్ (Harshwardhan Chauhan) కూడా సీఎం సీటును ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ పీసీసీ చీఫ్‍ కుల్‍దీప్ సింగ్ రాథోడ్ పేరు కూడా వినిపిస్తోంది. పార్టీని ఏకతాటిపైకి తానే తెచ్చానని రాథోడ్ చెబుతున్నారు. ఠాకూర్ కౌల్ సింగ్, ఆశాకుమారి కూడా రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఇంత మంది సీఎం సీటు ఆశిస్తుండడమే కాంగ్రెస్‍లో ఉత్కంఠగా మారింది.

అసంతృప్తి భయం

ముఖ్యమంత్రి పదవి కోసం ఇంత మంది పోటీ పడుతుంటడం కాంగ్రెస్‍లో కలవరం రేపుతోంది. సీఎంను ఎంపిక చేశాక ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలు బీజేపీవైపు చూడకుండా అందరికీ ముందు జాగ్రత్తగా సర్దిచెప్పాలని భావిస్తోంది. అందుకే సీనియర్లను రంగంలోకి దింపుతోంది.

Himachal Pradesh Elections Results: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

హిమాచల్ ప్రదేశ్‍లో 68 అసెంబ్లీ స్థానాలకు గాను 40 సీట్లను కాంగ్రెస్ పార్టీ సాధించింది. బీజేపీ 25కు పరిమితం అయింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.

తదుపరి వ్యాసం