తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dowry | 'గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని.. కట్నం ఇస్తేనే పెళ్లి లేకుంటే పెటాకులే'!

Dowry | 'గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని.. కట్నం ఇస్తేనే పెళ్లి లేకుంటే పెటాకులే'!

Manda Vikas HT Telugu

07 March 2022, 21:51 IST

    • అతడో గవర్నమెంట్ ఉద్యోగి, తన తండ్రి టీచర్ కాబట్టి మాలాంటి వాళ్లు కట్నం తీసుకోవడం తప్పెలా అవుతుందంటూ వరుడు నిలదీస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Groom justifies taking dowry is absolutely fine - Viral Video
Groom justifies taking dowry is absolutely fine - Viral Video (twitter)

Groom justifies taking dowry is absolutely fine - Viral Video

Patna | కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయినా మన దేశంలో కట్నం లేనిదే పెళ్లి జరగదు అనేది కాదనలేని వాస్తవం. డబ్బున్న వారు కట్నం ఇవ్వడం ఒక స్టేటస్‌గా చెప్పుకుంటే, లేనివారు మాత్రం పెళ్లిరోజుకి కట్నం డబ్బును సమకూర్చేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. పెళ్లి సమయానికి కట్నం ఇవ్వకపోతే మగపెళ్లివారు ఎలా రియాక్ట్ అవుతారోనని భయపడుతారు. కొంతమంది మగపెళ్లివారు ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ పెళ్లి రద్దు చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇదే తరహా బ్లాక్ మెయిలింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ వరుడు పెళ్లి సమయంలో తనకు రావాల్సిన కట్నం డబ్బులు, బంగారం, సామాగ్రి రాలేదని పేచీ పెట్టాడు. పూర్తిగా కట్నం ఇస్తేనే పెళ్లి లేకపోతే ఇక్కడిక్కడే క్యాన్సల్ చేసుకొని 'పెళ్లి బారాత్' తో ఒక్కడ్నే వెనక్కి వెళ్తానని చెప్పాడు. కట్నం తీసుకోవడం నేరం అని అక్కడున్న వారు ఒకరు నిలదీయగా.. ఎందుకు తప్పవుతుంది? కట్నం తీసుకోని వారు ఎవరుంటారు? మాట్లాడుకున్నట్లుగా కట్నం ముందే ఇచ్చేస్తే విషయం బయటకు రాదు. నాకు ఇవ్వనట్లుగా ఎవరికైనా ఇవ్వలేకపోతేనే వారిది బయటకొస్తుందని చెప్పాడు.

అంతేకాకుండా తాను ప్రభుత్వ ఉద్యోగి అని, తన తండ్రి ఒక టీచర్ అని చెప్పాడు. వధువు తరఫు వారు కోరుకున్నట్లుగా మేము మా విషయంలో కరెక్టుగా ఉన్నాం, వారు ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు నిలబడరు అంటూ అతడు రివర్స్ ప్రశ్న వేశాడు.

దీనికి సంబంధించిన వీడియో మహారాష్ట్ర పబ్లిక్ రిలేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్.. 'ఇలాంటి వారికి సిగ్గేందుకు రాదు' అనే క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్లో షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. మరి ఆ తర్వాత ఆ పెళ్లి ఏమైందో తెలియదు గానీ, నెటిజన్లు మాత్రం వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి వ్యాసం