తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Goa Crime: కూతురి పేరుతో ఫేక్ ప్రొఫైల్; తల్లికి లైంగిక వేధింపులు

Goa crime: కూతురి పేరుతో ఫేక్ ప్రొఫైల్; తల్లికి లైంగిక వేధింపులు

HT Telugu Desk HT Telugu

28 December 2022, 18:58 IST

  • Goa crime: తను ఇష్టపడ్డ మహిళ తనను దూరం పెట్టడంతో కోపం పెంచుకున్న ఒక వ్యక్తి విచక్షణ కోల్పోయి లైంగిక వేధింపుల నేరానికి పాల్పడడంతో ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

Goa crime: గోవాకి చెందిన సిద్ధనాథ్ కైసుకర్ అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న ఒక మహిళను విపరీతంగా ఇష్టపడ్డాడు. కానీ, ఆ మహిళ అతడి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించి, అతడిని దూరం పెట్టింది. వేరే వివాహం చేసుకుని హాయిగా ఉంది. దాంతో ఆమెపై సిద్ధనాథ్ కోపం పెంచుకున్నాడు.

Goa crime: కూతురి పేరుతో ఫేక్ ప్రొఫైల్..

ఆమెపై కక్ష తీర్చుకోవడం కోసం ఆమె టీనేజ్ కూతురి పేరు, ఫొటోతో ఫేస్ బుక్ లో ఒక ఫేక్ ప్రొఫైల్ ను రూపొందించాడు. అసభ్య కరమైన మెసేజ్ లు, వీడియోలు, ఫొటోలను అందులో అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు. వాటిని చూపి బెదిరిస్తూ, తన కోరిక తీర్చాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. దాంతో, ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దాంతో రంగంలోకి దిగిన గోవా పోలీసులు.. సిద్ధనాథ్ ను అదుపులోకి తీసుకుని, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కటకటాల వెనక్కు పంపించారు.

టాపిక్

తదుపరి వ్యాసం