తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Flybig ఎయిర్‌లైన్స్ నుంచి హైదరాబాద్- ఇండోర్ వయా గోండియా విమాన సర్వీస్ ప్రారంభం!

FlyBig ఎయిర్‌లైన్స్ నుంచి హైదరాబాద్- ఇండోర్ వయా గోండియా విమాన సర్వీస్ ప్రారంభం!

HT Telugu Desk HT Telugu

14 March 2022, 8:45 IST

    • UDAN స్కీమ్ కింద తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం సహా మరికొన్ని చోట్ల విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇవి ఇప్పటికీ కార్యరూపందాల్చడం లేదు.
Hyderabad -Indore flight service under UDAN Scheme
Hyderabad -Indore flight service under UDAN Scheme (twitter)

Hyderabad -Indore flight service under UDAN Scheme

Hyderabad | UDAN రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ కింద విమానయాన సేవలు అందించే ప్యాసింజర్ ఎయిర్‌లైన్ సంస్థ ఫ్లై బిగ్ (FlyBig), ఇండోర్-గోండియా-హైదరాబాద్ సర్వీస్‌ను మార్చి 13న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

గతేడాది ప్రారంభమైన FlyBig ఎయిర్‌లైన్స్ ఇదివరకు కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), దిబ్రూఘర్, గౌహతి, లిలాబరి, రూప్సీ (అస్సాం), అగర్తల (త్రిపుర) అలాగే పసిఘాట్, తేజు (అరుణాచల్ ప్రదేశ్) నగరాలకు విమాన సర్వీసులను నడిపింది. కేవలం ఈశాన్య భారతదేశానికే పరిమితమైన ఈ విమానయాన సంస్థ ఇప్పుడు హైదరాబాద్ (తెలంగాణ), గోండియా (మహారాష్ట్ర), ఇండోర్ (మధ్యప్రదేశ్) రాష్ట్రాలకు తన నెట్‌వర్క్‌ ను విస్తరించింది. మొత్తంగా దేశంలోని 11 నగరాలకు ఈ ఎయిర్‌లైన్ విమాన సర్వీసులను నడుపుతోంది.

కాగా, తాజాగా ప్రారంభమైన హైదరాబాద్- ఇండోర్ వయా గోండియా ఫ్లైట్‌ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం నాడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆదివారం నాడు ఇండోర్‌కు వచ్చిన ఫ్లైబిగ్ తొలి విమానానికి నీటి ఫిరంగులతో సాదర స్వాగతం పలికారు. ఈ వేడుకకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఫ్లైబిగ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మాండవియా సహా పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎయిర్ పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.

సోమవారం అంటే ఈరోజు హైదరాబాద్ నుంచి ఇండోర్ వయా గోండియా మీదుగా ఫ్లైబిగ్ ఫ్లైట్ తొలి సర్వీస్ ఉదయం 6:20 గంటలకు బయల్దేరి వెళ్లింది. మళ్లీ అక్కడ్నించి ఉదయం 10:20కి బయల్దేరి మధ్యాహ్నానికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ధరలు రూ. 1999/- నుంచి ప్రారంభమవుతాయని ఫ్లైబిగ్ తెలిపింది.

UDAN స్కీమ్ కింద తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం సహా మరికొన్ని చోట్ల విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇవి ఇప్పటికీ కార్యరూపందాల్చడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఒకేఒక్క విమానాశ్రయం హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ లో ఉంది.

తదుపరి వ్యాసం