తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake In Mp : మధ్యప్రదేశ్​- అరుణాచల్​ ప్రదేశ్​లో భూకంపం.. ‘మహా’లోనూ!

Earthquake in MP : మధ్యప్రదేశ్​- అరుణాచల్​ ప్రదేశ్​లో భూకంపం.. ‘మహా’లోనూ!

01 November 2022, 10:48 IST

  • Earthquake in MP today : దేశంలోని మూడు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు.

మధ్యప్రదేశ్​లో భూకంపం
మధ్యప్రదేశ్​లో భూకంపం (Mint)

మధ్యప్రదేశ్​లో భూకంపం

Earthquake in MP today : మధ్యప్రదేశ్​లో భూకంపంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంగళవారం ఉదయం సంభవించిన భూకంపం.. రిక్టార్​ స్కేలుపై తీవ్రత 3.9గా నమోదైంది.

నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ ప్రకారం.. మధ్యప్రదేశ్​లోని పచమర్హిలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమికి 10కి.మీల లోపల భూకంపం సంభవించింది.

అరుణాచల్​ ప్రదేశ్​లో కూడా..

అంతకుముందు.. మంగళవారం తెల్లవారుజామున అరుణాచల్​ ప్రదేశ్​లోనూ భూకంపం సంభవించింది. టవాంగ్​ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్ర 3.7గా నమోదైంది.

మహారాష్ట్రలోనూ..

మహారాష్ట్రాలో కూడా మంగళవారం ఉదయం భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. పాల్గఢ్​ జిల్లాలోని దహను ప్రాంతానికి 13కి.మీల దూరంలో భూమి కంపించినట్టు సమాచారం.

Earthquake in Maharashtra : దహను ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు నమోదవుతూ ఉంటాయి. 2018 నుంచి ఇక్కడ భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దుండల్వాడి గ్రామంలో భూ ప్రకంపనలు అధికంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు నిత్యం భయం భయంగా జీవిస్తూ ఉంటారు.

తాజా భూకంపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎవరికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.

భూకంపాలతో భయం భయం..

ఉత్తర, ఈశాన్య భారతాల్లో భూకంపాలు సంభవిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. సెప్టెంబర్​ నెల చివర్లో మయన్మార్​లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవిచంగా.. ఆ ప్రకంపనలు ఈశాన్య భారతంలోనూ నమోదయ్యాయి.

Earthquake today : ఇక ఆగస్టు నెలలో ఉత్తర భారతంలో భూకంపాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. జమ్ముకశ్మీర్​లో.. 3 రోజుల్లో వరుసగా 7సార్లు భూమి కంపించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే.. ఉత్తర్​ప్రదేశ్​ లక్నో, బిహార్​లో పలుమార్లు భూ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే.. వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు.

అటు ప్రపంచవ్యాప్తంగానూ భూకంపాలు భయపెడుతున్నాయి. చైనా, తైవాన్​, ఇండోనేషియా, మెక్సికోల్లో భూ ప్రకంపనలు.. భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టానికి దారి తీస్తున్నాయి.

తదుపరి వ్యాసం