తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Madras High Court Ruling | `సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను అరెస్ట్ చేయొద్దు`

Madras High Court ruling | `సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను అరెస్ట్ చేయొద్దు`

HT Telugu Desk HT Telugu

18 June 2022, 22:38 IST

  • గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను అనుస‌రిస్తూ.. మద్రాసు హైకోర్టు శ‌నివారం ఒక సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. వ్య‌భిచార గృహాల‌పై దాడులు చేసే స‌మ‌యంలో పోలీసులు సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను అరెస్ట్ చేయ‌డం కానీ, వేధించ‌డం కానీ, శిక్షించ‌డం కానీ చేయ‌వ‌ద్ద‌ని ఆదేశించింది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఇటీవ‌లి సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ మ‌ద్రాసు హైకోర్టు ఈ ఆదేశాల‌ను వెలువ‌రించింది. వ్య‌భిచార గృహాన్ని నిర్వ‌హించ‌డం మాత్ర‌మే నేర‌మ‌ని, వాటిపై దాడులు చేసే స‌మ‌యంలో అందులోని సెక్స్ వ‌ర్క‌ర్ల‌పై దౌర్జ‌న్యం చేయ‌వ‌ద్ద‌ని, వారిని శిక్షించ‌వ‌ద్ద‌ని, వారిని అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని, వారిని వేధింపుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను కోర్టు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కార‌మే..

ఇటీవ‌ల సుప్రీంకోర్టు సెక్స్ వ‌ర్క‌ర్ల గురించి ఒక సంచ‌ల‌న తీర్పు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వ్య‌భిచారం కూడా ఒక వృత్తిగానే గుర్తించాల‌ని, వ్య‌భిచార గృహాల్లో దాడుల స‌మ‌యంలో అక్క‌డ ఉన్న సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని కోర్టు ఆ తీర్పులో స్ప‌ష్టం చేసింది. `మేజ‌ర్ అయిన ఒక సెక్స్ వ‌ర్క‌ర్ త‌న ఇష్టానుసారం లైంగిక చ‌ర్య‌లో పాల్గొంటే.. ఆ వ్య‌క్తిపై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరాదు` అని సుప్రీంకోర్టు పేర్కొంది. తాజాగా, మ‌ద్రాసు హైకోర్టు ఆ తీర్పును ఉటంకిస్తూ.. ఒక బ్రోత‌ల్ హౌజ్‌ క‌స్ట‌మ‌ర్‌పై పోలీసులు న‌మోదు చేసిన కేసును కొట్టివేసింది. వ్య‌భిచార గృహానికి వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్‌ను శిక్షించ‌డం చ‌ట్టబ‌ద్ధం కాద‌ని, ఆయ‌న సెక్స్‌వ‌ర్క‌ర్ల‌ను బ‌ల‌వంతం చేయ‌లేదని తేలినందున ఈ కేసు కొట్టివేస్తున్నామ‌ని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీశ్ కుమార్ తెలిపారు. అనంత‌రం చింతాద్రిపేట్‌లోని ఒక వ్య‌భిచార గృహంలో అరెస్ట్ చేసిన ఉద‌య్‌కుమార్ అనే వ్య‌క్తిని క‌స్ట‌డీ నుంచి విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు.

మ‌స్సాజ్ సెంట‌ర్ ముసుగులో

మ‌స్సాజ్ సెంట‌ర్ ముసుగులో వ్య‌భిచార గృహం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలుసుకుని పోలీసులు చేసిన దాడిలో ఉద‌య్‌కుమార్‌, ప‌లువురు సెక్స్ వ‌ర్క‌ర్లు దొరికిపోయారు. `వ్య‌భిచార గృహం నిర్వ‌హించ‌డం నేరం. కానీ అందులో వ్య‌భిచార వృత్తిలో ఉండ‌డం నేరం కాదు. వారు త‌మ వృత్తిలో ఉన్నారు. వారిని ఎవ‌రూ బ‌ల‌వంతం చేయ‌లేదు. అందువ‌ల్ల అవి ఐపీసీలోని ఆర్టిక‌ల్ 370కింద‌కు రావు` అని న్యాయ‌మూర్తి స్ప‌ష్టం చేశారు.

తదుపరి వ్యాసం