తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump: “నేను చేసిన నేరం అదొక్కటే..”: డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు: బైడెన్‍పై ఫైర్

Donald Trump: “నేను చేసిన నేరం అదొక్కటే..”: డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు: బైడెన్‍పై ఫైర్

05 April 2023, 11:56 IST

    • Donald Trump Comments after Arraignment: 2024 ఎన్నికల్లో తనను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు తప్పుడు కేసులు తనపై పెట్టారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కోర్టు తనపై నేరారోపణలు మోపిన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు.
Donald Trump: “నేను చేసిన నేరం అదొక్కటే..”: విడుదల తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు
Donald Trump: “నేను చేసిన నేరం అదొక్కటే..”: విడుదల తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు (Getty Images via AFP)

Donald Trump: “నేను చేసిన నేరం అదొక్కటే..”: విడుదల తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు

Donald Trump Comments after Arraignment: పోర్న్ స్టార్‌కు డబ్బు ఇవ్వడం సహా కోర్టు నుంచి 34 నేరారోపణలు ఎదుర్కొన్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. న్యూయార్క్ కోర్టు(New York Court)లో అరెస్టయి.. నేరారోపణలను ఎదుర్కొని విచారణ అనంతరం విడుదలైన తర్వాత ఆయన తొలిసారి మాట్లాడారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‍పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నరకం దిశగా వెళుతోందని, దేశానికి ఇలా జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

న్యూయార్క్‌లోని మ్యాన్‍హాటన్ కోర్టు 34 నేరారోపణలను డొనాల్డ్ ట్రంప్‍పై మోపింది. ఆ తర్వాత విడుదల చేసింది. అనంతరం ఫ్లోరిడాలోని తన నివాసం మార్-ఓ-లాగోలో (Mar-a-Lago) తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.

“నేను చేసిన తప్పు అదొక్కటే”

Donald Trump Comments after Arraignment: అమెరికాను నాశనం చేయాలనుకున్న వారి నుంచి దేశాన్ని పటిష్ఠంగా కాపాడడమే తాను చేసిన ఒకేఒక్క నేరం అని ట్రంప్ అన్నారు. వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. “ఇలాంటిది అమెరికాలో జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మన దేశం నాశనం కావాలని కోరుకున్న వారి నుంచి ఎలాంటి భయం లేకుండా కాపాడడమే నేను చేసిన ఒకే ఒక్క నేరం” అని ట్రంప్ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‍పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విధానాల వల్ల అమెరికా నరకంలోకి వెళుతోందని, తప్పుడు నిర్ణయాల వల్ల ప్రపంచం ముందు దేశం పరువు పోతోందని వ్యాఖ్యనించారు.

ప్రపంచం నవ్వుతోంది

“మన దేశం తిరోగమనంలో ఉంది. చట్టాన్ని బలవంతంగా ప్రయోగించడం ద్వారా ఎన్నికల్లో కలుగజేసుకోవాలని లెఫ్ట్ ఉన్మాదులు భావిస్తున్నారు. దీన్ని మేం జరగనివ్వం” అని ట్రంప్ అన్నారు. మొత్తంగా 25 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రస్తుతం అమెరికాపై కారుమబ్బులు కమ్ముతున్నాయని, దేశాన్ని తాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతానని ట్రంప్ అన్నారు.

“మన దేశం గడ్డుకాలంలోకి వెళుతోంది. సరిహద్దుల్లో ఉదాసీనత, అఫ్గానిస్థాన్ నుంచి దళాల ఉపసంహరణ వంటి వాటి పట్ల ఇప్పటికే మనల్ని చూసి ప్రపంచం నవ్వుతోంది” అని ట్రంప్ చెప్పారు.

2024 అధ్యక్ష ఎన్నికల్లో తనను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు, ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకే తనపై తప్పుడు కేసులు బనాయించారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

2024 ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున మళ్లీ అధ్యక్ష బరిలోకి దిగారని ట్రంప్ భావిస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్నారు. ఇప్పుడు తాజా పరిణామాలతో అమెరికాలో రాజకీయాలు కీలక మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి.

తనతో ఉన్న లైంగిక బంధాన్ని బయటపెట్టకూడదని 2016 అధ్యక్ష ఎన్నికల ముందు డొనాల్డ్ ట్రంప్ తనకు 1,30,000 డాలర్లు ఇచ్చారని పోర్న్ స్మార్మీ డేనియల్స్ (Stormy Daniels) గతంలో ఆరోపించారు. 2019లో ట్రంప్ న్యాయవాది మైకేల్ కొహెన్ ఈ విషయాన్ని అంగీకరించారు. దీంతో మ్యాన్‍హాటన్ జ్యూరీ ప్యానెల్ దీనిపై విచారణ జరిపింది. ట్రంప్‍పై అభియోగాన్ని మోపింది. మొత్తంగా 34 నేరాలను ట్రంప్‍పై మోపింది. అయితే ఆయన వాటిని అంగీకరించలేదు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా పని చేసి క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొన్న తొలి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.

తదుపరి వ్యాసం