తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్.. రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్.. రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

HT Telugu Desk HT Telugu

06 June 2023, 21:29 IST

    • ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ఆ విమానాన్ని రష్యాకు డైవర్ట్ చేశారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి 232 మంది వరకు ఉన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

విమానంలోని ఇంజిన్లలో ఒక దానికి సాంకేతిక సమస్య తలెత్తడంతో ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా రష్యాలోని మాగదాన్ (Magadan) విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. రష్యాలోని మాగదాన్ లో ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

ఎయిర్ ఇండియా ఏఐ173 విమానంలో సమస్య..

ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ173 లోని ఒక ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది కలిపి మొత్తం 232 మంది ఉన్నారు. దాంతో, విమాన మార్గాన్ని తప్పించి, మార్గమధ్యంలోని రష్యాకు విమానాన్ని డైవర్ట్ చేశారు. అనంతరం, రష్యాలోని మాగదాన్ (Magadan) విమానాశ్రయంలో ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో మరో ఎయిర్ ఇండియా విమానానికి కూడా ఇలాగే జరిగింది. చెన్నై నుంచి సింగపూర్ వెళ్తున్న ఫ్లైట్ ను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మలేసియాకు డైవర్ట్ చేశారు.

తదుపరి వ్యాసం