తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress President Election : అక్టోబర్​ 17న కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్​ పోటీ చేస్తారా?

Congress president election : అక్టోబర్​ 17న కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్​ పోటీ చేస్తారా?

Sharath Chitturi HT Telugu

28 August 2022, 17:05 IST

    • Congress president election : అక్టోబర్​ 17న కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్​ వెల్లడించింది.
కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికలపై కీలక ప్రకటన
కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికలపై కీలక ప్రకటన (HT_PRINT)

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికలపై కీలక ప్రకటన

Congress president election : అధ్యక్ష ఎన్నికపై ఆదివారం కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్​. ఈ ఏడాది అక్టోబర్​ 17న.. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక జరగనుందని వెల్లడించింది. అదే నెల 19న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని వివరించింది. ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్​ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

విదేశాల్లో ఉన్న కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. వర్చువల్​గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆమె అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ జరిగింది.

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్​ ప్రక్రియ సెప్టెంబర్​ 24న మొదలై.. 30వ తేదీతో ముగుస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్​ సెప్టెంబర్​ 22న వెలువడుతుంది. అక్టోబర్​ 8లోపు.. నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

కాంగ్రెస్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్​ జోడో యాత్రపై ఈ భేటీలో నేతలు చర్చించారు. యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​ భారత్​ జోడా యాత్రపై వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Ghulam Nabi Azad Congress : కాంగ్రెస్​లో అత్యంత సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​.. పార్టీకి వీడ్కోలు పలికిన కొన్ని రోజుల వ్యవధిలో జరిగిన ఈ సీడబ్ల్యూసీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో అనేక లోపాలను లేవనెత్తుతూ.. సోనియా గాంధీకి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు.

"రాహుల్​ గాంధీ అపరిపక్వతతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. యూపీఏ హయాంలో ప్రభుత్వ ఆర్డినెన్స్​ను మీడియా ముందు చింపివేశారు. చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ పరాభవానికి ఇది ఒక కారణం. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. హడావుడిగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ," అని గులాం నబీ ఆజాద్​ మండిపడ్డారు.

రాహుల్​ గాంధీపై ఎవరికీ నమ్మకం లేదని ఆరోపించారు గులాం నబీ ఆజాద్​. గాంధీతో పాటు ఆయన సెక్యూరిటీ గార్డులే కాంగ్రెస్​ను నడిపిస్తున్నారని విమర్శించారు. పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని పేర్కొన్నారు.

గులామ్​ నబీ ఆజాద్​ రాజీనామాపై పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

రాహుల్​ గాంధీ పోటీ చేస్తారా?

Rahul Gandhi : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక తేదీ వచ్చేసింది. ఇప్పుడు అందరి కళ్లు.. రాహుల్​ గాంధీపైనే ఉన్నాయి. ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. పార్టీ వైఫల్యాలతో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ పదవిపై ఆయన ఆసక్తి చూపకపోయినప్పటికీ.. అనేకమంది కాంగ్రెస్​ నేతలు.. రాహుల్​వైపే మొగ్గుచూపుతున్నారు. ఆయనను బలవంతంగానైనా పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ పరిస్థితుల్లో.. రాహుల్​ గాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తారా? లేక.. అశోక్​ గహ్లోత్​.. కాంగ్రెస్​ అధ్యక్షుడిగా నియమితుడవుతారా? వంటి ప్రశ్నలకు అక్టోబర్​లో సమాధానం లభిస్తుంది.

తదుపరి వ్యాసం