తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China May To Witness 25,000 Deaths Per Day: చైనాలో రోజుకు 25 వేల కోవిడ్ మరణాలు?

China may to witness 25,000 deaths per day: చైనాలో రోజుకు 25 వేల కోవిడ్ మరణాలు?

HT Telugu Desk HT Telugu

30 December 2022, 21:11 IST

  • చైనాలో కొరోనా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. ఇది జనవరిలో మరింత ఉధృతం కానుందని వైద్యారోగ్య విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కోవిడ్ 19 వాస్తవ పరిస్థితిపై చైనా నుంచి అధికారిక సమాచారమేదీ రావడం లేదు. అయినా, పలు దేశాలకు చెందిన సంస్థలు చైనాలో పరిస్థితిని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

covid situation in China: ప్రస్తుతం 9 వేల మరణాలు

జీరో కోవిడ్ పాలసీ(zero covid policy)ని చైనా ప్రభుత్వం ఉపసంహరించుకున్న తరువాత, ఆ ప్రభుత్వం హెచ్చరించిన తీరుగానే, ఆ దేశంలో కేసుల సంఖ్య అదుపు చేయలేని స్థాయిలో పెరుగుతోంది. యూకేకు చెందిన వైద్య విషయాల విశ్లేషణ సంస్థ Airfinity ప్రకారం.. ప్రస్తుతం చైనాలో కోవిడ్ (covid 19) కారణంగా రోజుకు 9 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డిసెంబర్ 1 నుంచి చైనాలో లక్ష మంది వరకు కొరోనా (corona) తో చనిపోయారు. అలాగే, డిసెంబర్ 1 నుంచి మొత్తంగా కోటి ఎనభై ఆరు లక్షల మంది కొరోనా బారిన పడ్డారు.

China may to witness 25,000 deaths per day: జనవరిలో తీవ్రం

జనవరి నెలలో చైనాలో కొరోనా కేసుల సంఖ్య, కోవిడ్ 19 (covid 19) మరణాల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుతుందని యూకేకు చెందిన వైద్య విషయాల విశ్లేషణ సంస్థ Airfinity అంచనా వేస్తోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం.. జనవరి 13న, ఒక్క రోజే చైనాలో అత్యధికంగా 37 లక్షల corona కేసులు నమోదవుతాయి. అలాగే, మరణాల విషయానికి వస్తే, జనవరి 23న, ఒక్క రోజే, కోవిడ్ 19 (covid 19) తో అత్యధికంగా, 25 వేల మంది మరణిస్తారు. అలాగే, జనవరిలో ఆ రోజుకు చైనాలో కొరోనా(corona) తో మరణించే వారి మొత్తం సంఖ్య 5.84 లక్షలకు చేరుతుంది.

WHO asks China: సరైన డేటా ఇవ్వండి

కోవిడ్ మరణాలు, corona కేసుల సంఖ్య విషయంలో చైనా వాస్తవ సమాచారాన్ని ఇవ్వడం లేదని ప్రపంచం భావిస్తోంది. కోవిడ్ 19కు సంబంధించి సరైన డేటా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) చీఫ్ టెడ్రోస్ కూడా చైనా ను కోరారు. కొరోనా(corona) విజృంభణపై సరైనా సమాచారం ఇవ్వడం ద్వారా ఇతర దేశాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి సులువవుతుందని ఆయన వివరించారు. చైనా అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో కోవిడ్ 19 (covid 19) తో రోజువారీ మరణాల సంఖ్య 10 దాటడం లేదు.

తదుపరి వ్యాసం