తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Clerk Prelims Result 2024 : ఎస్​బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ పరీక్ష ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

SBI Clerk Prelims Result 2024 : ఎస్​బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ పరీక్ష ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

26 January 2024, 12:09 IST

    • SBI Clerk Prelims Results : ఎస్​బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ పరీక్ష రాశారా? మెయిన్స్​ పరీక్షకు అర్హత సాధించాలంటే.. ప్రిలిమ్స్​లో అర్హత పొందాలి. అందుకే రిజల్ట్స్​ని ఇలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇక్కడ చూడండి..
స్​బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ పరీక్ష ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..
స్​బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ పరీక్ష ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి.. (HT File)

స్​బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ పరీక్ష ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

SBI Clerk Prelims Result 2024 expected date : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) క్లర్క్ ప్రిలిమ్స్ 2024 ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. జూనియర్ అసోసియేట్స్ ప్రిలిమినరీ ఫలితాలు ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ sbi.co.in లో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షను 2024 జనవరి 5, 6, 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించింది ఎస్​బీఐ. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ.. ఈ కింది స్టెప్స్​ని అనుసరించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఎస్​బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024: ఇలా చెక్​ చేసుకోండి..

  • స్టెప్​ 1:- ఎస్​బీఐ అధికారిక sbi.co.in వెబ్​సైట్​లోకి వెళ్లండి.
  • స్టెప్​ 2:- హోం పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 3:- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు.. క్లర్క్ రిక్రూట్మెంట్ లింక్​ని వెతకలి.
  • SBI Clerk Prelims Result 2024 : స్టెప్​ 4:- పేజీలో అందుబాటులో ఉన్న ఎస్​బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ 2024 లింక్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 5:- అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్​పై క్లిక్ చేయాలి.
  • స్టెప్​ 6:- మీ ఫలితాలు స్క్రీన్​పై కనిపిస్తాయి.
  • స్టెప్​ 7:- రిజల్ట్ చెక్ చేసుకుని దానిని డౌన్​లోడ్ చేసుకోండి. హార్డ్​ కాపీ భద్రపరుచుకోండి.

నెక్ట్స్​ ఏంటీ?

SBI Clerk Prelims Result 2024 official website : ఎస్​బీఐ క్లర్క్​ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులవుతారు. మెయిన్ పరీక్షను 2024 ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. డేట్​పై ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై స్పష్టత రావొచ్చు.

రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 8283 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది ఎస్​బీఐ. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

యూపీఎస్​ఈ పోస్టుల వివరాలు చూశారా..?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్పెషలిస్ట్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 27న ప్రారంభమై 2024 ఫిబ్రవరి 15న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 69 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలు ఇక్కడ చూడొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం