తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Income Tax Return: ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి

Income tax return: ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి

01 March 2022, 8:54 IST

    • Income tax return: ఐటీఆర్ పైల్ చేసేటప్పుడు అసెస్మెంట్ సంవత్సరాన్ని తప్పుగా ఎంచుకోవడం, మీ బ్యాంక్ ఖాతాను ముందస్తుగా ధ్రువీకరించకపోవడం లేదా బ్యాంక్ వివరాలు తప్పుగా నమోదు చేయడం, ఐటీఆర్ ఫైల్ చేసిన 120 రోజులలోపు ఈ-వెరిఫై చేయకపోవడం లాంటి తప్పులు దొర్లవచ్చు. ఫలితంగా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు.
ఐటీఆర్
ఐటీఆర్ (Unsplash)

ఐటీఆర్

Income tax return: పన్ను పరిధిలోకి వచ్చేవారు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు(ITR) ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానానికి మీరు కొత్త కానప్పటికీ కొంచెం సవాలుగా అనిపించవచ్చు.

గజిబిజిగా ఉన్న పత్రాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. అంతేకాకుండా చివరి నిమిషం వరకు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు వెబ్ పోర్టల్‌లో అవాంతరాలు ఎదురవుతుంటాయి.

ప్రతి ఏడాది పన్ను నిబంధనల్లో అనేక మార్పులు క్లిష్టతరంగా అనిపిస్తాయి. ఫలితంగా మీ ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేసేటప్పుడు తప్పులు జరుగుతాయి. అసెస్మెంట్ సంవత్సరాన్ని తప్పుగా ఎంచుకోవడం, మీ బ్యాంక్ ఖాతాను ముందస్తుగా ధ్రువీకరించకపోవడం లేదా బ్యాంక్ వివరాలు తప్పుగా నమోదు చేయడం, ఐటీఆర్ ఫైల్ చేసిన 120 రోజులలోపు ఈ-వెరిఫై చేయకపోవడం లాంటి తప్పులు దొర్లవచ్చు.

ఫలితంగా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు. కాబట్టి ఈ లోపాలను సరిదిద్ది సరైన క్రమంలో ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఎదురయ్యే కొన్ని సాధారణ తప్పులు నివారించడానికి ఇక్కడ కొన్ని మార్గనిర్దేశకాలు ఉన్నాయి.

నివాస స్థితిలో తప్పుడు సమాచారం..

క్రితం ఆర్థిక సంవత్సరంలో మీరు భారత్‌లో ప్రాథమికంగా నివసించిన రోజుల సంఖ్య, రెసిడెన్షియల్ స్టేటస్‌ను నిబంధనల ప్రకారం పొందుపరచాలి. ఎందుకంటే ఇది మీ పన్ను బాధ్యతలను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారత సంతతికి చెందిన వ్యక్తి గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 182 లేదా అంతకంటే ఎక్కువరోజులు ఉన్నట్లయితే సదరు వ్యక్తి నివాసి విభాగం కిందకు వస్తారు.

అయితే వారు సాధారణ నివాసి అవునా, కాదా అని నిర్ణయించేటప్పుడు అనేక ఇతర షరతులు వర్తిస్తాయి. చాలా సార్లు పన్ను చెల్లింపుదారులు ఈ విషయంలో తప్పులు చేస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్‌లో పన్ను చెల్లింపుదారులు ఇతర దేశాల్లో సంపాదిస్తున్నట్లయితే వారి ఆస్తులు, అకౌంట్లకు సంబంధించి ఐటీఆర్-2 పొందుపరచాల్సి ఉంటుంది. లేకుంటే చట్టరీత్యా శిక్షార్హులవుతారు.

జాబితా చేయని షేర్ల సమాచారాన్ని దాచిపెట్టడం..

మీరు ఏదైనా అన్ లిస్టెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో షేర్లను కలిగి ఉంటే తప్పకుండా ఆ స్టాక్ వివరాలను, క్రితం సంవత్సరంలో జరిగిన క్రయవిక్రయాలను కొనుగోలు ఖర్చుతో పాటు అందించాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఇవి పన్ను బాధ్యతను నిర్ణయించడంలో అధికారులకు సహాయపడుతుంది. మీరు ఈ వివరాలను బహిర్గతం చేయడంలో విఫలమైతే తప్పుడు రిటర్న్‌ను దాఖలు పరిచినట్లే అవుతుంది. ముఖ్యంగా అంకుర సంస్థలు, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఈ నిబంధన విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి.

సేవింగ్ అకౌంట్ వడ్డీని ప్రకటించకపోవడం..

మనలో చాలా మంది అత్యవసర అవసరాలను తీర్చడానికి మా పొదుపు బ్యాంకుల్లో గణనీయమైన మొత్తాలను ఉంచుతారు. ఇప్పుడు ఈ బ్యాంక్ బ్యాలెన్స్‌పై ప్రతి త్రైమాసికంలో వడ్డీని చెల్లిస్తుంది కానీ ఈ మొత్తం మీ ఎంప్లాయిర్ జారీ చేసిన ఫారం-16లో ప్రతిబింబించదు.

మీకు అందిన ఈ వడ్డీని ఐటీఆర్‌లో ఫైల్ చేయడంలో విఫలమైతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందుకుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి కూడా ఇది వర్తిస్తుంది. ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద ప్రకటించాలి.

ఉద్యోగాలు మారితే పూర్తి ఏడాదికి జీతం నివేదించాలి..

మీరు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారినట్లయితే మునుపటి ఎంప్లాయిర్ జారీ చేసిన ఫారం-16ను పొందడం మర్చిపోవద్దు. ఇద్దరు యజమానుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో పరిగణించాలి. అది బహిర్గతం చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు.

డివిడెండ్ ఆదాయాన్ని వెల్లడించకపోవడం..

ఇది ప్రత్యేకించి ఈ అసెస్మెంట్ సంవత్సరం నుంచి వర్తిస్తుంది. కొంతమంది వ్యక్తిగత పెట్టుబడుదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌పై ఆర్జించిన డివిడెండ్ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయే అవకాశముంది.

ఈ సంవత్సరం ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొందరు తప్పులు చేయవచ్చు. ఎందుకంటే అలాంటి డివిడెండ్ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే వ్యక్తిగత పెట్టుబడిదారుల ద్వారా పన్నుకు గురవుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం