తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Polygamy: బహుభార్యత్వాన్ని నిషేధించే యోచనలో అసోం: కమిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం

Polygamy: బహుభార్యత్వాన్ని నిషేధించే యోచనలో అసోం: కమిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం

09 May 2023, 22:40 IST

    • Polygamy: బహుభార్యత్వాన్ని బ్యాన్ చేసేందుకు అసోం ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం బిశ్వ శర్మ ప్రకటించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Pitamber Newar)

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

Polygamy: బహుభార్యత్వాన్ని నిషేధించే దిశగా బీజేపీ పాలిత అసోం (Assam) ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు. బహుభార్యత్వాన్ని (Polygamy) నిషేధించే అధికారం శాసనసభకు ఉందా లేదా.. చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా అన్న విషయాలను అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గువహటిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

అన్ని అంశాల పరిశీలన

బహుభార్యత్వం (Polygamy) బ్యాన్ సాధ్యాసాధ్యాలపై ఆ నిపుణుల కమిటీ విస్తృత సంప్రదింపులు, పరిశీలనలు చేస్తుందని అసోం సీఎం బిశ్వశర్మ తెలిపారు. ముస్లిం పర్సనల్ చట్టం (షరియా) యాక్ట్ 1937, భారత రాజ్యంగంలోని 25వ అధికరణ ఆదేశిక సూత్రాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. న్యాయ నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని, వారి సలహాలను సేకరిస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంతో సంబంధం ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని అన్నారు.

Polygamy: భారత దేశంలో ముస్లింలు, కొన్ని గిరిజన వర్గాలు మినహా మిగిలిన వారికి బహుభార్యత్వం ప్రస్తుతం చట్టవిరుద్ధంగా ఉంది. ఒకవేళ అసోం.. బహుభార్వత్వంపై బ్యాన్ తీసుకొస్తే అందరికీ వర్తించే అవకాశం ఉంది.

ఉమ్మడి పౌరస్మృతి కోసం ఎదురుచూడం

Polygamy: ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code - UCC)లో బహుభార్యత్వం నిషేధం కూడా ఓ అంశంగా ఉంది. అయితే, బహుభార్యత్వం విషయంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం వేచిచూడబోమని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు.

“జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం అవసరమైన ఉమ్మడి పౌరస్మృతి వైపు మేం ప్రస్తుతం వెళ్లడం లేదు. యూసీసీ విషయంలో కేంద్రం చొరవ తీసుకుంటుంది. అయితే యూసీసీలో ఓ భాగమైన బహుభార్వత్యాన్ని రాష్ట్రంలో నిషేధించాలనే ఉద్దేశ్యాన్ని మేం చెబుతున్నాం” అని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం మేరకే తాము ఈ విషయంలో ఓ తుది నిర్ణయం తీసుకుంటామని, బలవంతంగా తీసుకురాబోమని అన్నారు.

Polygamy: అసోంలో బాల్య వివాహాల అంశం ఇటీవల తీవ్ర చర్చనీయాంశం అయింది. బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. కొందరు పురుషులు ఎక్కువసార్లు వివాహాలు చేసుకున్నారని, వారి భార్యల వయసు చాలా తక్కువగా ఉందని ఈ తనిఖీల్లో తేలింది. బాల్య వివాహాలు చేసుకున్న వందలాది మంది పురుషులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. బాల్య వివాహాలపై తాము చర్యలను కొనసాగిస్తామని సీఎం హిమంత స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం