తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Asian Paints Q1 Results: ఏషియన్ పెయింట్స్ నికర లాభంలో 80 శాతం పెరుగుదల

Asian paints Q1 Results: ఏషియన్ పెయింట్స్ నికర లాభంలో 80 శాతం పెరుగుదల

HT Telugu Desk HT Telugu

26 July 2022, 14:52 IST

    • Asian paints Q1 Results: ఏషియన్ పెయింట్స్ క్వార్టర్ - 1లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది.
ఏషియన్ పెయింట్స్ క్యూ 1 ఫలితాలు విడుదల
ఏషియన్ పెయింట్స్ క్యూ 1 ఫలితాలు విడుదల

ఏషియన్ పెయింట్స్ క్యూ 1 ఫలితాలు విడుదల

Asian paints Q1 Results: ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో నికర లాభం 80 శాతం పెరిగినట్టు నివేదించింది.

ట్రెండింగ్ వార్తలు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

గత ఏడాది జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 574 కోట్ల నికర లాభం ఆర్జించగా ఇప్పుడది రూ. 1,036 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. అలాగే ఆదాయం కూడా 54 శాతం పెరిగి రూ. 8,607 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 5,585 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా కంపెనీ వాల్యూమ్ గడిచిన ఆరు క్వార్టర్లతో పోలిస్తే ఈ క్వార్టర్‌లోనే అత్యధికంగా నమోదైందని తెలిపింది.

దేశీయ డెకొరేటివ్ బిజినెస్ పటిష్టంగా ఉండడం, డిమాండ్ భారీగా పుంజుకోవడం కారణంగా జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రెవెన్యూ భారీగా పెరిగింది. అయితే గత ఏడాది కోవిడ్ రెండో విడత ఆంక్షల కారణంగా రెవెన్యూ దెబ్బతిన్నదని కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ సింగ్లే తెలిపారు. ఇండస్ట్రియల్ బిజినెస్, హోం ఇంప్రూవ్‌మెంట్ బిజినెస్ కూడా గత ఏడాది లో బేస్‌తో పోల్చితే రెండింతలైందని చెప్పారు.

ఇంటర్నేషనల్ మార్కెట్లలో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ కనబరిచినట్టు కంపెనీ సీఈవో తెలిపారు.

ఇక జూన్ క్వార్టర్‌లో ఎబిటా 88.65 శాతం పెరిగింది. గ్రాస్ మార్జిన్ మాత్రం జూన్ 2021 క్వార్టర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గి 40.26 శాతంగా ఉంది. ఇన్‌పుట్ వ్యయాలు పెరిగినందున ధరలు పెంచినప్పటికీ మార్జిన్ తక్కువగా ఉంది.

‘ముడి చమురు ధరల్లో అధిక ద్రవ్యోల్భణం కారణంగా జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో మార్జిన్‌పై తీవ్రమైన ప్రభావం పడింది…’ అని సీఈవో వివరించారు.

ఏషియన్ పెయింట్స్ 15 దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలు చేస్తుంది.

మొదటి క్వార్టర్ ఆదాయ ఫలితాలు వెల్లడించిన తరువాత ఏషియన్ పెయింట్స్ స్వల్పంగా లాభాల్లో ట్రేడవుతోంది.

తదుపరి వ్యాసం