తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tech Mahindra Q1 Results: 16.4 శాతం తగ్గిన టెక్ మహీంద్రా నికర లాభం

Tech Mahindra Q1 Results: 16.4 శాతం తగ్గిన టెక్ మహీంద్రా నికర లాభం

HT Telugu Desk HT Telugu

25 July 2022, 16:47 IST

  • Tech Mahindra Q1 Results: టెక్ మహీంద్ర నికర లాభం 16.4 శాతం మేర తగ్గింది.

టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ (ఫైల్ ఫోటో)
టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ (ఫైల్ ఫోటో) (Bloomberg)

టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ (ఫైల్ ఫోటో)

ముంబై, జూలై 25: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 16.4 శాతం తగ్గిందని, నికర లాభం రూ. 1,132 కోట్లు ఆర్జించామని టెక్ మహీంద్రా నివేదించింది.

ట్రెండింగ్ వార్తలు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ ఎగుమతుల కంపెనీగా ఉన్న టెక్ మహీంద్రా గ్రూప్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,353 కోట్ల మేర నిరక లాభం ఆర్జించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్వార్టర్-1లో రెవెన్యూ 24.6 శాతం పెరిగి రూ. 12,708 కోట్ల మేర ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది క్యూ1లో రెవెన్యూ రూ. 10,918 కోట్లుగా ఉంది.

నిర్వహణ లాభం 9.2 శాతం క్షీణించి రూ. 1,403.4 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభాల మార్జిన్ 15.2 శాతం నుండి 11 శాతానికి తగ్గిందని కంపెనీ సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది.

త్రైమాసికంలో 6,862 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.58 లక్షలకు చేరుకుంది.

‘మేం డైనమిక్ గ్లోబల్ స్థూల ఆర్థిక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని స్థితిస్థాపకంగా, అప్రమత్తంగా ఉంటాం. విభిన్నమైన ఆఫర్‌లను అందించడానికి కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం..’ అని దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పి.గుర్నాని చెప్పారు.

సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 1.15 శాతం పడిపోయి రూ. 1,016.55 వద్ద ముగిసింది.

తదుపరి వ్యాసం