తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Rape, Murder Case: చిన్నారిపై హత్యాచారం; దోషికి మరణశిక్ష; నేరం జరిగిన 4 నెలల్లోనే శిక్ష ఖరారు

Kerala Rape, murder case: చిన్నారిపై హత్యాచారం; దోషికి మరణశిక్ష; నేరం జరిగిన 4 నెలల్లోనే శిక్ష ఖరారు

HT Telugu Desk HT Telugu

14 November 2023, 14:05 IST

  • Kerala Rape, murder case: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, దారుణంగా చంపేసిన రాక్షసుడికి పొక్సొ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం మరణ శిక్ష విధించింది.

పోలీసుల అదుపులో ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన అష్వాఖ్ ఆలమ్
పోలీసుల అదుపులో ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన అష్వాఖ్ ఆలమ్

పోలీసుల అదుపులో ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన అష్వాఖ్ ఆలమ్

Kerala Rape, murder case: కేరళలోని అలువాలో ఈ జులై నెలలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని అష్వాఖ్ ఆలమ్ అనే రాక్షసుడు బలవంతంగా తీసుకువెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత, ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

బిహార్ బాలిక..

బిహార్ నుంచి ఉపాధి కోసం కేరళకు వలస కూలీలుగా వచ్చిన కుటుంబానికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై మరో వలస కూలీ అష్వాఖ్ ఆలమ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంవత్సరం జులై 28న కొచ్చి సమీపంలోని అలువాలో (Aluva Rape, Murder Case) తాము అద్దెకు ఉంటున్న ఇంటి బయట ఆ బాలిక ఆడుకుంటోంది. మద్యం మత్తులో ఉన్న వలస కూలీ అష్వాఖ్ ఆలమ్ ఆ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి, అలువా మార్కెట్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేసి, అనంతరం, గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, దగ్గర్లోని చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ఈ నేరం కేరళలో సంచలనం సృష్టించింది.

వెంటనే స్పందించిన పోలీసులు

తమ కూతురు కనిపించకపోవడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి, ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు, బాధిత బాలిక కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోని సీసీ టవీ ఫుటేజ్ ను పరిశీలించి, నిందితుడిని గుర్తించారు. వెంటనే గాలింపు ప్రారంభించి, నేరం జరిగిన కొన్ని గంటల్లోపే నిందితుడిని పట్టుకున్నారు. అప్పటికీ అతడు మద్యం మత్తులోనే ఉన్నాడు.

4 నెలల్లోనే..

అనంతరం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు పొక్సొ (POCSO - Protection Of Children from Sexual Offences) ప్రత్యేక కోర్టులో నెల రోజుల్లోపే చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణను న్యాయమూర్తి కే సోమన్ అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించారు. 26 రోజుల్లో విచారణ ముగించారు. నవంబర్ 4వ తేదీన అష్వాఖ్ ఆలమ్ ను దోషిగా నిర్ధారించారు. నవంబర్ 14న అతడికి మరణ శిక్ష విధించారు. చిన్నారిపై హత్యాచారం కేసులో అష్వాఖ్ ఆలమ్ కు శిక్ష విధించిన నవంబర్ 14వ తేదీ చిన్నారుల దినోత్సవం కావడం విశేషం. అలాగే, 11 సంవత్సరాల క్రితం 2012లో, ఇదే నవంబర్ 14, న లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పొక్సొ (POCSO - Protection Of Children from Sexual Offences) చట్టం అమల్లోకి వచ్చింది.

తదుపరి వ్యాసం