తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian-americans Elected To Us House: అమెరికా ఎన్నికల్లో ఇండో అమెరికన్ల హవా

Indian-Americans elected to US House: అమెరికా ఎన్నికల్లో ఇండో అమెరికన్ల హవా

HT Telugu Desk HT Telugu

09 November 2022, 23:09 IST

  • Indian-Americans elected to US House: అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో భారతీయుల హవా కొనసాగింది. నలుగురు ఇండో అమెరికన్లు విజయం సాధించగా, మరొకరి ఫలితం ఇంకా వెలువడలేదు.

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన ఇండో అమెరికన్ రో ఖన్నా
అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన ఇండో అమెరికన్ రో ఖన్నా

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన ఇండో అమెరికన్ రో ఖన్నా

Indian-Americans elected to US House: అమెరికా లో నవంబర్ 8న జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో నలుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించగా, మరో అభ్యర్థి విజయం కూడా దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.

Indian-Americans elected to US House: వరుస విజయాలు..

భారతీయ సంతతికి చెందిన ప్రముఖ నాయకులైన రాజా కృష్ణమూర్తి, రొ ఖన్నా, ప్రమీల జయపాల్ మరోసారి ప్రతినిధుల సభకు మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. వారితో పాటు ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలో నిలిచిన బిజినెస్ మ్యాన్ శ్రీ తానేదార్ కూడా విజయం సాధించారు. ఈ నలుగురు కూడా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. మరో ఇండో అమెరికన్ అభ్యర్థి అమీ బెరా పోటీ చేసిన స్థానం ఫలితాలు ఇంకా వెలువడలేదు. కానీ బెరా విజయం ఖాయమేనని తెలుస్తోంది.

Indian-Americans elected to US House: మిషిగన్ నుంచి తొలిసారి

తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన శ్రీ తానేదార్ మిషిగన్ స్థానంలో రిపబ్లికన్ అభ్యర్థి మార్టెల్ బివింగ్స్ ను ఓడించారు. మిషిగన్ లో ఇండో అమెరికన్ విజయం సాధించడం ఇదే ప్రథమం. అలాగే, ఇలినాయిస్ ఎనిమిదవ డిస్ట్రిక్ట్ నుంచి రాజా కృష్ణమూర్తి వరుసగా నాలుగో సారి విజయం సాధించారు. కాలిఫొర్నియా 17వ డిస్ట్రిక్ట్ నుంచి రో ఖన్నా విజయం సాధించారు. ఆయన ఓడించిన రిపబ్లికన్ అభ్యర్థి రితేశ్ టాండన్ కూడా ఇండో అమెరికనే కావడం విశేషం.

Indian-Americans elected to US House: తమిళ మూలాలు..

తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ప్రమీల జయపాల్ వాషింగ్టన్ స్టేట్ 7వ డిస్ట్రిక్ట్ నుంచి గెలుపొందారు. ఆమె అమెరికా కాంగ్రెస్ లో ఉన్న ఏకైక మహిళా ఇండో అమెరికన్. వరుసగా ఆరో సారి బరిలో నిలిచన అమీ బెరా ఎన్నిక ఫలితం ఇంకా వెలువడలేదు. అలాగే, మేరీలాండ్ లెఫ్ట్ నెట్ గవర్నర్ గా ఇండో అమెరికన్ అరుణ మిల్లర్ గెలుపొంది, రికార్డు సృష్టించారు. కాగా, టెక్సస్ నుంచి పోటీ చేసిన ఇండో అమెరికన్ సందీప్ శ్రీవాస్తవ పరాజయం పాలయ్యారు.

తదుపరి వ్యాసం