తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Twin Towers | నోయిడా ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత‌; మూడంత‌స్తుల ఎత్తున‌ శిధిలాలు

Twin towers | నోయిడా ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత‌; మూడంత‌స్తుల ఎత్తున‌ శిధిలాలు

25 August 2022, 20:04 IST

  • సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు నోయిడాలోని అత్యంత ఎత్తైన ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత‌కు రంగం సిద్ధ‌మైంది. ఆగ‌స్ట్ 28న ఆ ట్విన్ ట‌వ‌ర్స్‌ను కూల్చేయ‌డానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నోయిడా ట్విన్ ట‌వ‌ర్స్‌
నోయిడా ట్విన్ ట‌వ‌ర్స్‌

నోయిడా ట్విన్ ట‌వ‌ర్స్‌

నోయిడాలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మితమైన ఎత్తైన ట్విన్ ట‌వ‌ర్స్‌ను కూల్చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దాంతో, ఆ 32 అంత‌స్తుల జంట భ‌వ‌నాల‌ను మున్సిప‌ల్ అధికారులు కూల్చేయ‌నున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

Twin towers demolition| సూప‌ర్ టెక్ బిల్డింగ్‌

సూప‌ర్ టెక్ సంస్థ నోయిడాలో ఈ ట్విన్ ట‌వ‌ర్స్‌ను నిర్మించింది. ఇందులోని రెండు ట‌వ‌ర్ల‌లో ఒక‌టి 32 అంత‌స్తులు, మ‌రొక‌టి 29 అంత‌స్తులు ఉంటాయి. ఈ జంట ట‌వ‌ర్ల‌ను ఈ ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో కూల్చివేయ‌నున్నారు. ఇందుకు గానూ అన్ని అంత‌స్తుల్లో పేలుడు ప‌దార్ధాల‌ను అమ‌ర్చారు. వీటిని ఒక వైర్ ద్వారా అనుసంధానించి, ఆ జంట భ‌వనాల‌కు దాదాపు 100 మీట‌ర్ల దూరం నుంచి వాటిని పేల్చేస్తారు. దాంతో, క్ష‌ణాల్లో ఆ భ‌వ‌నాలు నేల‌మ‌ట్ట‌మ‌వుతాయి. ఈ భ‌వ‌నాల కూల్చివేత‌కు సుమారు 3,700 కిలోల పీఈటీఎన్ పేలుడు ప‌దార్ధాల‌ను (PETN explosives) ఉప‌యోగిస్తున్నారు. వాట‌ర్ ఫాల్ త‌ర‌హాలో ఈ ట్విన్ ట‌వ‌ర్స్ కుప్ప‌కూలేలా ఈ పేలుడు ప‌దార్ధాల‌ను అమ‌ర్చారు.

Twin towers demolition| 80 వేల టన్నుల శిధిలాలు..

ఈ ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత వ‌ల్ల దాదాపు 80 వేల ట‌న్నుల శిధిలాలు ఏర్ప‌డ‌నున్నాయి. ఇవి ఆ స్థ‌లంలో మూడంత‌స్తుల ఎత్తులో గుట్ట‌గా ఏర్ప‌డుతాయి. ఈ 80 వేల ట‌న్నుల్లో దాదాపు 4 వేల ట‌న్నుల‌ ఐర‌న్ ఉంటుంద‌ని అంచ‌నా. ఈ ట్విన్ ట‌వ‌ర్స్‌కు చుట్టుప‌క్క‌ల ఉన్న భ‌వ‌నాల‌కు ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా అధికారులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. పేలుడు అనంత‌రం ద‌ట్టంగా క‌మ్ముకునే దుమ్ము, దూళి ఆయా భ‌వ‌నాల‌పై ప‌డ‌కుండా ఆ భ‌వ‌నాల‌పై జియోటెక్స్‌టైల్స్‌ను క‌ప్ప‌నున్నారు. అయితే, పేలుడు ధాటికి ద‌గ్గ‌ర్లోని భ‌వ‌నాల కిటికీల అద్దాలు ప‌గిలిపోయే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ భారీ పేలుడుతో జ‌రిగే ప్ర‌మాదంపై ఆ ట్విన్ ట‌వ‌ర్స్ ద‌గ్గ‌ర‌లో నివ‌సిస్తున్న వారిలో కొంత భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. శిధిలాలుగా ఏర్ప‌డే 80 వేల ట‌న్నుల్లో 50 వేల ట‌న్నుల‌ను అక్క‌డే ఉంచాల‌ని, మిగ‌తా 30 వేల ట‌న్నుల‌ను సెక్ట‌ర్ 80లో ఉన్న డిమాలిష‌న్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌కు త‌ర‌లించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. అక్క‌డ ఆ శిధిలాల‌ను సైంటిఫిక్‌గా డిస్పోజ్ చేస్తారు.

తదుపరి వ్యాసం