తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fire In Russia Cafe: నైట్ బార్ లో అగ్ని ప్రమాదం; 15 మంది మృతి

Fire in Russia cafe: నైట్ బార్ లో అగ్ని ప్రమాదం; 15 మంది మృతి

HT Telugu Desk HT Telugu

05 November 2022, 19:03 IST

    • Fire in Russia cafe: రష్యా రాజధాని మాస్కోకు సుమారు 300కిమీల దూరంలో ఉన్న కొస్ట్రోమా పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక నైట్ బార్ లో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన క్లబ్ వద్ద కొనసాగుతున్న సహాయ చర్యలు
ప్రమాదం జరిగిన క్లబ్ వద్ద కొనసాగుతున్న సహాయ చర్యలు (AFP)

ప్రమాదం జరిగిన క్లబ్ వద్ద కొనసాగుతున్న సహాయ చర్యలు

Fire in Russia cafe: రష్యాలోని చారిత్రాత్మక పట్టణం కొస్ట్రొమాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా, సహాయ సిబ్బంది సుమారు 250 మందిని రక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

Fire in Russia cafe: నైట్ క్లబ్ లో..

కొస్ట్రొమాలోని ఒక ఫేమస్ నైట్ క్లబ్ లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఒక వ్యక్తి డ్యాన్స్ ఫ్లోర్ లో ఫ్లేర్ గన్ ను పేల్చడంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. బార్ లో తలెత్తిన వివాదం ముదరడంతో ఒక వ్యక్తి తన వద్ద ఉన్న ఫ్లేర్ గన్ ను పేల్చడంతో మంటలు అంటుకున్నాయన్న మరో కథనం కూడా వినిపిస్తోంది. మంటలు శరవేగంగా అన్ని ఫ్లోర్లకు విస్తరించాయని స్థానిక మీడియా తెలిపింది. మంటలంటుకుని 15 మంది చనిపోయారని, దాదాపు 19మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది.

Fire in Russia cafe: కుప్పకూలిన రూఫ్

అగ్ని మాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి దాదాపు 250 మందిని రక్షించారు. మంటల్లో కాలిపోయి బార్ రూఫ్ కుప్పకూలింది. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లేర్ గన్ పేల్చాడని చెబుతున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొస్ట్రొమాలో సుమారు 3 లక్షల మంది పౌరులు ఉంటారు.

తదుపరి వ్యాసం