తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gangrape: 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం; ‘నిర్భయ’ తరహాలో చిత్ర హింసలు

Gangrape: 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం; ‘నిర్భయ’ తరహాలో చిత్ర హింసలు

HT Telugu Desk HT Telugu

28 July 2023, 17:39 IST

  • Gangrape: మధ్య ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. చిన్నారి బాలికను బలవంతంగా తీసుకువెళ్లి, చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gangrape: మధ్య ప్రదేశ్ లో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఒక వ్యక్తి గిరిజనుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఘటన, మరో వ్యక్తిని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, బలవంతంగా కాలు నాకించుకున్న ఘటన.. మరచిపోకముందే రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, దారుణంగా చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారం చేసి, రాత్రంతా తమవద్దే పెట్టుకుని నిర్భయ తరహాలో చిత్రహింసలకు గురిచేస్తూ, ఉదయం వదిలిపెట్టిన కిరాతక ఘటన మధ్య ప్రదేశ్ లో గురువారం చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

‘నిర్భయ’ తరహాలో చిత్రహింసలు పెట్టి..

మధ్య ప్రదేశ్ లోని సత్నా జిల్లాలో 11 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. గురువారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న ఆ బాలిక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. సాయంత్రం తరువాత కూడా, ఆ బాలిక తిరిగిరాకపోవడంతో, గ్రామంలో వెతికిన కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర్నాడు, శుక్రవారం ఉదయం ఒళ్లంతా గాయాలతో, దాదాపు అపస్మారక స్థితిలో ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. తనను బలవంతంగా తీసుకువెళ్లి, దారుణంగా చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారం చేసి, రాత్రంతా చిత్రహింసలకు గురిచేస్తూ, ఉదయం వదిలిపెట్టారని, తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే వారు, స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, ఆ బాలికను మైహర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం మేవా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

నిందితుల అరెస్ట్..

బాలిక నుంచి సమాచారం తీసుకున్న తరువాత.. నిందితులైన రవి చౌధరి, అతుల్ బదౌలియాలను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారు ఇద్దరు స్థానికంగా ఉన్న మైహార్ టెంపుల్ మేనేజ్ మెంట్ కమిటీ నిర్వహించే గోశాలలో ఉద్యోగులని వెల్లడించారు. వారిపై పొక్సొ (POCSO) చట్టం, ఐపీసీ 376డీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. కాగా, ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దోషులెవరూ తప్పించుకోకూడదని, తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి, తగిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఆ బాలిక కు సరైన చికిత్స అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేత, రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్ విమర్శించారు. 11 ఏళ్ల బాలికను నిర్భయ తరహాలో దారుణంగా చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తదుపరి వ్యాసం