తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Vitiligo Day 2022 : ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్సే లేదు..

World Vitiligo Day 2022 : ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్సే లేదు..

25 June 2022, 11:27 IST

    • బొల్లి అనేది చాలా అరుదైన చర్మ వ్యాధి. ప్రముఖ సంగీత కళాకారుడు మైఖేల్ జాక్సన్ కూడా ఈ చర్మ వ్యాధితో బాధపడ్డారు. ఆయన స్మారకార్థం.. ఆయన చనిపోయిన రోజున అనగా జూన్ 25న ఏటా ప్రపంచ బొల్లి దినోత్సం నిర్వహిస్తున్నారు. ఆ వ్యాధి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
బొల్లి
బొల్లి

బొల్లి

World Vitiligo Day 2022 : ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీన ప్రపంచ బొల్లి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన చర్మ వ్యాధి - 'బొల్లి' గురించి.. ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీనిని చేస్తున్నారు. దీనిని ల్యుకోడెర్మా అని పిలుస్తారు. బొల్లి అనేది దీర్ఘకాలిక చర్మ స్వయం ప్రతిరక్షక స్థితి. ఇది బాధితుడి శరీరంపై తెల్లటి లేదా తేలికపాటి పాచెస్ ఏర్పరుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Cucumber Egg fried Rice: కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్... బ్రేక్ ఫాస్ట్ లో అదిరిపోయే వంటకం, ఎవరికైనా నచ్చుతుంది

Saturday Motivation: ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

అధ్యయనాల ప్రకారం.. ప్రపంచ జనాభాలో 1-2 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ రుగ్మత భారతదేశం అంతటా చాలా ప్రబలంగా ఉంది. ఈ అరుదైన వ్యాధి మెలనిన్ లోపం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. స్పర్శ ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇది అబద్ధం అంటున్నారు నిపుణులు.

జూన్ 25న దీనిని ఎందుకు నిర్వహిస్తారు?

ఈ అరుదైన చర్మ వ్యాధితో బాధపడిన ప్రముఖ సంగీత కళాకారుడు మైఖేల్ జాక్సన్ స్మారకార్థం జూన్ 25న ప్రపంచ బొల్లి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మైఖేల్ జాక్సన్ జూన్ 25, 2009 న మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.

ప్రపంచ బొల్లి దినోత్సవం చరిత్ర

ప్రపంచ బొల్లి దినోత్సవం మొదటిసారి 2011లో నిర్వహించారు. దీనిని ‘బొల్లి అవేర్‌నెస్ డే’, ‘బొల్లి పర్పుల్ ఫన్ డే’ అని కూడా పిలుస్తారు. విటిలిగో ఫ్రెండ్స్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు స్టీవ్ హరగడాన్ ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు. ఇది తరువాత నైజీరియన్ బొల్లి రోగిచే అభివృద్ధి చెందింది.

బొల్లి లక్షణాలు

* సెగ్మెంటల్ బొల్లి: ఈ రకమైన బొల్లి శరీరంలోని ఒక ప్రాంతాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. అలాగే స్థానిక బొల్లి అని పిలుస్తారు. ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది.

* నాన్-సెగ్మెంటల్ బొల్లి: ఈ రకమైన బొల్లి శరీరంలోని ఇతర ప్రాంతాలలో చేతులు, మోచేతులు, బాడీ ఓపెనింగ్స్ చుట్టూ ఉన్న చర్మంపై తెల్లని మచ్చలను కలిగిస్తుంది.

సెగ్మెంటల్ బొల్లి కంటే నాన్-సెగ్మెంటల్ బొల్లి చాలా సాధారణం.

బొల్లి వ్యాధి చికిత్సలు

ఈ అరుదైన వ్యాధి చికిత్స చర్మంపై మచ్చల రూపాన్ని మెరుగుపరుస్తుంది. కానీ వ్యాధిని నయం చేయదు.

వ్యాధికి చికిత్స చేయడానికి కొన్ని సాధారణ మార్గాలు:

* నోటి మందులు

* మెడిసిన్, లేజర్ చికిత్స

* సన్​స్క్రీన్లు

* కౌన్సెలింగ్, మద్దతు

టాపిక్

తదుపరి వ్యాసం