తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Asthma Day 2023 । శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? ఆస్తమాను ఇలా ఎదుర్కోండి!

World Asthma Day 2023 । శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? ఆస్తమాను ఇలా ఎదుర్కోండి!

HT Telugu Desk HT Telugu

02 May 2023, 8:39 IST

    • World Asthma Day 2023: ఆస్తమాకు చికిత్స లేనప్పటికీ సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఆస్తమాను నియంత్రించే చిట్కాలు చూడండి.
World Asthma Day 2023:
World Asthma Day 2023: (Unsplash)

World Asthma Day 2023:

World Asthma Day 2023: ఆస్తమా అనేది పిల్లలను, పెద్దలను ఎవరినైనా ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఆస్తమా ఉన్న వారికి సాధారణంగా శ్వాసనాళాలు సంకోచానికి లోనై వాపు ఏర్పడుతుంది. ఇది ఇరుకైన గాలి మార్గాలకు దారితీస్తుంది. ఫలితంగా దగ్గు, శ్వాసలోపం, ఛాతీలో బిగుతును వంటి లక్షణాలను అనుభవించవచ్చు. అంతేకాకుండా నాసికా రంధ్రాల్లో అదనపు శ్లేష్మం కూడా ఉత్పత్తి అవుతుంది, ఊపిరి పీల్చుకున్నప్పుడు విజిల్ శబ్దం రావడం, దగ్గును కూడా అనుభవిస్తుండవచ్చు. ఈ లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కొందరు దీర్ఘకాలిక లక్షణాలను అనుభవిస్తారు. మరికొందరు కొద్దిసేపే దాని ప్రభావాన్ని కలిగి ఉంటారు.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

ఆస్తమాకు చికిత్స లేదు, అయినప్పటికీ, కొన్ని రకాల ఔషధాలు, ఇతర మార్గాల ద్వారా లక్షణాలను అదుపుచేయవచ్చు. ఉబ్బసంను ఎదుర్కొనేవారు కూడా చురుకైన జీవితాన్ని గడపవచ్చు. ఆస్తమా గురించి అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మే మొదటి మంగళవారం రోజున ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది.

ఆస్తమాను నియంత్రించే చిట్కాలు

  • మీ ఇన్‌హేలర్‌ని ఎల్లవేళలా మీతో తీసుకెళ్లండి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినపుడు ఇన్‌హేలర్‌ పీల్చినపుడు శ్వాస రంధ్రాలు తెరుచుకుంటాయి.
  • ఇన్‌హేలర్‌లను ఉపయోగించే పిల్లలకు వారి స్కూల్ బ్యాగ్‌లో అదనంగా మరొక ఇన్‌హేలర్‌ను ఉంచడం మేలు.
  • వైద్యులు సూచించిన ఔషధాలు తప్పకుండా వాడాలి. మందులు వాడకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు.
  • మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి సమృద్ధిగా నీరు తాగండి, వేడివేడి సూప్‌లు, హెర్బల్ టీలు తాగడం ద్వారా ఉపశమనంగా ఉంటుంది.
  • జలుబు, ఫ్లూ వంటి అలర్జీ కారకాలను నియంత్రించండి. మీ చేతులను సబ్బు, నీటితో తరచుగా కడగాలి. వీలైతే ఫ్లూ వ్యాక్సిన్ పొందండి.
  • నోటితో ఊపిరి పీల్చడం కష్టంగా ఉన్నప్పుడు మీ ముక్కు ద్వారానే శ్వాస తీసుకోండి. నోటి ద్వారా పీల్చిన గాలి మీ ఊపిరితిత్తులలోకి వెళ్ళే సమయంలో వేడిగా మారి శ్వాసనాళాలను వ్యాకోచింపజేస్తుంది.
  • మందులు వాడుతూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేయడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వేడి వాతావరణం కారణంగా వేసవి కాలంలో వ్యాయామంతో కూడా ఆస్తమా తీవ్రమయ్యే అవకాశాలు పెరుగుతాయి. అయితే కొన్ని శ్వాస వ్యాయామాలతో ఆస్తమా లక్షణాలను తగ్గించుకోవచ్చు.

ఉబ్బసం అనేది సమర్థవంతంగా నియంత్రించే పరిస్థితి. ఆస్తమా ఉన్న వ్యక్తులు వారి పరిస్థితిపై అవగాహన కలిగి ఉండటం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా చురుకైన జీవితాన్ని గడపగలరు అని వైద్యులు భరోసా ఇస్తున్నారు.

తదుపరి వ్యాసం