తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Missed Period: మీకు పీరియడ్స్ మిస్ అయ్యాయా? చింతించకండి.. ఈ కారణాలై ఉండొచ్చు

Missed Period: మీకు పీరియడ్స్ మిస్ అయ్యాయా? చింతించకండి.. ఈ కారణాలై ఉండొచ్చు

HT Telugu Desk HT Telugu

01 November 2023, 16:37 IST

    • పీరియడ్స్ మిస్ అవడం లేదా డిలే అవడం మెనోపాజ్ దశకు రాని స్త్రీలను ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. పీరియడ్స్‌ రాకపోవడం ఆందోళనకరంగా అనిపించినప్పటికీ, ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఇక్కడ తెలుసుకోండి.
పీరియడ్స్ మిస్ అవడానికి చాాలా కారణాలు ఉంటాయి
పీరియడ్స్ మిస్ అవడానికి చాాలా కారణాలు ఉంటాయి (Pixabay)

పీరియడ్స్ మిస్ అవడానికి చాాలా కారణాలు ఉంటాయి

పీరియడ్స్ మిస్ అవడానికి ముందుగా కొన్ని సాధారణ కారణాలు ఇక్కడ తెలుసుకోండి. అవసరాన్ని బట్టి వైద్యుడిని సంప్రదించండి.

పీరియడ్స్ మిస్ అవడానికి కారణాలు

  1. ప్రెగ్నెన్సీ: పీరియడ్స్ మిస్ కావడానికి ఇది చాలా స్పష్టమైన కారణం. అయితే అన్ని సందర్భాలూ ఇదే కారణమై ఉండదని గమనించాలి.
  2. ఒత్తిడి: ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది పీరియడ్స్ మిస్ కావడానికి దారితీస్తుంది.
  3. బరువులో మార్పులు: ఆకస్మికంగా బరువు తగ్గడం లేదా పెరగడం కూడా మీ రుతుచక్రానికి ఇబ్బందులు పెట్టొచ్చు.
  4. వ్యాయామం: అధిక వ్యాయామం అండం విడుదలను అణిచివేస్తుంది. పీరియడ్స్‌ ఆలస్యం కావడానికి ఇది దారితీస్తుంది.
  5. మందులు: గర్భనిరోధక మాత్రలు, యాంటిడిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు కూడా పీరియడ్స్ మిస్సవడానికి కారణం కావచ్చు.
  6. అనారోగ్యం: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), థైరాయిడ్ సమస్యలు వంటి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఋతుక్రమం ఆలస్యం కావడానికి కారణం కావచ్చు.

లైంగికంగా చురుగ్గా ఉండి మీకు పీరియడ్స్ మిస్ అయినట్లయితే, ముందుగా గర్భధారణ పరీక్షను చేసుకోండి. మీరు ఇంటివద్దనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో గర్భధారణ పరీక్షను చేసుకోవచ్చు. రూ. 100 లోపు ఉండే ఈ టెస్ట్ కిట్‌పై ఉన్న సూచనలు పాటించి మూత్ర పరీక్ష చేయడం ద్వారా మీరు ప్రెగ్నెన్సీని నిర్ధారించుకోవచ్చు.

లేదా మీ వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు. మీరు గర్భవతి కానట్లయితే, మీ డాక్టర్ ఋతుస్రావం తప్పిపోవడానికి కారణాలను విశ్లేషిస్తారు. ఇందుకు కొన్ని పరీక్షలను సూచిస్తారు.

పీరియడ్స్ సక్రమంగా రావాలంటే

  1. మీ ఒత్తిడి తగ్గించుకోండి..ఒత్తిడి మీ ఋతు చక్రంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి.
  2. బరువుపై దృష్టిపెట్టండి. ఆకస్మిక బరువు తగ్గడం లేదా పెరగడం వల్ల మీ పీరియడ్స్ డిలే అవ్వొచ్చు. మీ వయస్సు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం అవసరం.
  3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. సమతుల్య ఆహారం మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి, మీ ఋతు చక్రం సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది.
  4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యం కోసం వ్యాయామం ముఖ్యం. వారంలో ఐదు రోజులు కనీసం 30 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయండి.
  5. తగినంత నిద్ర పొందండి. హార్మోన్ల నియంత్రణకు నిద్ర చాలా అవసరం. రాత్రికి 7-8 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.

మీరు వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పీరియడ్స్ మిస్ అయినట్లయితే లేదా మీరు భారీ రక్తస్రావం, పెల్విక్ నొప్పి లేదా క్రమరహిత పీరియడ్స్ వంటి ఇతర లక్షణాలను ఎదుర్కొంటుంటే, మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

తదుపరి వ్యాసం