తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rrc-wr Railway Jobs: స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. పూర్తి వివరాలవే!

RRC-WR Railway jobs: స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. పూర్తి వివరాలవే!

HT Telugu Desk HT Telugu

10 September 2022, 17:12 IST

    •  వెస్ట్రన్ రైల్వేలో  స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు RRC WR అధికారిక సైట్ rrc-wr.com ద్వారా అప్లై చేసుకోవచ్చు.
Western Railways Recruitment 2022
Western Railways Recruitment 2022

Western Railways Recruitment 2022

వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు RRC WR అధికారిక సైట్ rrc-wr.com ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5, 2022న ప్రారంభించబడింది. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 4, 2022 వరకు ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల కోసం దిగువన చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

ఉద్యోగాలు

Level 4 and 5: 05 పోస్ట్‌లు

Level 2 and 3: 16 పోస్ట్‌లు

అర్హతలు

Level 4 and 5: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.

Level 2 and 3: 12వ (+2 స్టెజ్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత. విద్యార్హత తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉండాలి.

అభ్యర్థి వయోపరిమితి జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్థులకు: రూ. 500/-

SC / ST / మాజీ సైనికులు / మహిళలు, మైనారిటీలు / EBC అభ్యర్థులు: రూ. 250/-

చెల్లింపు విధానం: ఆన్‌లైన్

వేతనం:

లెవల్ 4, 5 పోస్టులకు మ్యాట్రిక్స్ 25500-81100 / 29200- 92300 చెల్లించబడుతుంది. లెవెల్ 2, 3 పోస్టులకు, పే మ్యాట్రిక్స్ 19900-63200 / 21700-69100 పే స్కేల్‌లో ఇవ్వబడుతుంది

పశ్చిమ రైల్వే నోటిఫికేషన్ ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్: rrc-wr.com

ఎంపిక ప్రక్రియ:

రైల్వే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ట్రయల్స్ & స్పోర్ట్ ఫర్మామెన్స్ , విద్యా అర్హతలతో సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపికలో ట్రయల్ కమిటీ క్రీడా సామర్థత, భారతీయ రైల్వే జట్టులో ఆడడం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ట్రయల్స్ ఆధారంగా అభ్యర్థులు 'FIT' లేదా 'UNFIT'గా నిర్ణయిస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం