తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti | ఈ 3 సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే జీవితం ప్రమాదంలో పడ్డట్లే!

Chanakya Niti | ఈ 3 సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే జీవితం ప్రమాదంలో పడ్డట్లే!

HT Telugu Desk HT Telugu

13 August 2023, 6:06 IST

    • Chanakya Niti Telugu: ఆచార్య చాణక్యుడి ప్రకారం, జీవితంలో కొన్నింటితో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అది వ్యక్తులైనా కావచ్చు, మరేదైనా కావచ్చు. వాటితో సహవాసం మీ జీవితానికి చాలా ప్రమాదకరం అని చాణక్యుడు హెచ్చరించాడు.
Chanakya Niti Telugu:
Chanakya Niti Telugu: (Unsplash)

Chanakya Niti Telugu:

Chanakya Niti Telugu: ఆచార్య చాణక్యుడు ఒక తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, న్యాయ శాస్త్రవేత్తగా, రాజ సలహాదారుగా ప్రఖ్యాతిగాంచాడు. ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం 'నీతిశాస్త్రం' కాలానికి అతీతమైన నిజ జీవిత పాఠాల సమాహారం. చాణక్య నీతి ద్వారా ఆయన బోధనలు నేటికీ ప్రతీ వ్యక్తి వర్తిస్తాయి, చాణక్యుడి నీతి సూత్రాలు ప్రతీ వ్యక్తికి జీవితానికి మార్గనిర్ధేశనం చేస్తాయి, వారిని కష్టాల నుంచి గట్టెక్కడంలో సహాయపడతాయి. చాణక్య నీతిశాస్త్రం అనేక విలువైన పాఠాలను కలిగి ఉంది. అందులో ఒక పాఠాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఆచార్య చాణక్యుడి ప్రకారం, జీవితంలో కొన్నింటితో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అది వ్యక్తులైనా కావచ్చు, మరేదైనా కావచ్చు. వాటితో సహవాసం మీ జీవితానికి చాలా ప్రమాదకరం అని చాణక్యుడు హెచ్చరించాడు. చాణక్యుడి ప్రకారం, మనం అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం.

1. శత్రువుతో జాగ్రత్త

చాణక్యుడు ప్రకారం, వివేకం గల వ్యక్తి తన శత్రువుల శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ప్రత్యర్థులు కొన్నిసార్లు నిష్క్రియంగా కనిపించినా లేదా ఓడిపోయినా, ఇక వారి పని ముగిసిపోయిందని భావించకూడదు. వారి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వారికి సమయం అనుకూలంగా మారినపుడు, వారు దానిని అవకాశంగా మలుచుకొని మీకు ఎదురుదెబ్బ కొట్టవచ్చు లేదా మీ వినాశనానికి సమయాన్ని వెచ్చించవచ్చు. కాబట్టి, శత్రువు మనతో స్నేహ హస్తాన్ని చాచినా వారి ప్రతి కదలికను గమనించడం మరియు వారి బలాలు, బలహీనతలను అర్థం చేసుకోవడం ముఖ్యం. వారి హానికరమైన ఉద్దేశ్యాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా అవసరం. మీరు అప్రమత్తంగా ఉన్నప్పుడే మీ శత్రువులపై మీరు పైచేయి సాధించగలరు అని గ్రహించాలి.

2. వ్యాధులతో జాగ్రత్త

వ్యక్తిగత శ్రేయస్సు విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని చాణక్యుడు హెచ్చరించాడు. ఎందుకంటే కొన్నిసార్లు శత్రువులు కాదు, వారికి ఉన్న వ్యాధులు వారిని ఘోరంగా దెబ్బతీస్తాయి. అందుకే చాణక్యుడు వ్యాధిని ఒకరికి అతిపెద్ద శత్రువుగా అభివర్ణించాడు. ఒక వ్యక్తి పురోగతికి, విజయానికి వ్యాధులు తీవ్రంగా ఆటంకం కలిగిస్తాయనని పేర్కొన్నాడు. లక్ష్యాలను సాధించాలంటే, ముందు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు మీ ఉత్పాదను పెంచుతాయి, విజయవంతమైన జీవితానికి పునాదిని అందిస్తాయి.

3. పామును నమ్మవద్దు

పాముతో అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఇక్కడ పాము అంటే, దానికి చాణక్యుడు చాలా లోతైన అర్థాన్ని నిర్వచించాడు. పామును నమ్మకద్రోహం చేసే వ్యక్తితో పోల్చాడు. పాముకు మనం ఎంత పాలు పోసి పెంచినా, ఎంత బాగా ఆరాధించినా, అది తిరిగి మిమ్మల్ని ఊహించని విధంగా కాటు వేస్తుంది, మీ ప్రాణాల మీదకు తెస్తుంది. మనుషుల్లో కూడా ఇలాంటి విషస్వభావం కలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారు మన వద్ద హానిచేయని వారిగా, మంచివారిగా నటించవచ్చు, కానీ వారి నిజమైన ఉద్దేశాలు దుర్మార్గంగా ఉండవచ్చు. అటువంటి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే వారు వేరొకరి జీవితానికి ప్రమాదకరమమైన వ్యక్తిగా పరిణమించవచ్చు. కాబట్టి వ్యక్తుల స్వభావాన్ని అర్థం చేసుకోవాలని, వారితో మెలిగేటపుడు అప్రమత్తంగా ఉండాలని నీతిశాస్త్రం బోధిస్తుంది.

తదుపరి వ్యాసం