తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu। మనకు నిజమైన మిత్రుడు ఎవరు, మన శత్రువు ఎవరో అవి చూసి చెప్పేయొచ్చు!

Chanakya Niti Telugu। మనకు నిజమైన మిత్రుడు ఎవరు, మన శత్రువు ఎవరో అవి చూసి చెప్పేయొచ్చు!

HT Telugu Desk HT Telugu

09 August 2023, 7:53 IST

    • Chanakya Niti Telugu: మంచి స్నేహితుడిని ఎంచుకోవడంలో వారిలో కొన్ని గుణాలను పరిశీలించాలని చెప్పాడు, అవేమిటో తెలుసుందాం.
Chanakya Niti Telugu
Chanakya Niti Telugu

Chanakya Niti Telugu

Chanakya Niti Telugu: చాణక్యుడు ప్రకారం, ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక నిజమైన స్నేహితుడు జీవితానికి విలువైన ఆస్తి అవుతాడు. స్నేహితులు లేని వ్యక్తి జీవితమే వృధా, జీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండాలి అని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తెలిపాడు, అయితే మంచి స్నేహితులు ఉండటమూ ముఖ్యమే. మనం చేసే స్నేహాలు ఎలాంటివో అవే మన వ్యక్తిత్వాన్ని, మన భవిషత్తును నిర్ణయిస్తాయని చాణక్యుడు తెలిపాడు. నమ్మకద్రోహం చేసే వారు కాకుండా, విశ్వాసంగా ఉండే వారిని, సన్మార్గంలో నడిచే వారిని, స్థాయికి తగిన వారిని స్నేహితులుగా చేసుకోవాలని సూచించాడు. కానీ, నిజమైన స్నేహితుడ్ని గుర్తించడం ఎలా? చాణక్యుడు ప్రకారం, మనం స్నేహం చేయాలనుకునే వ్యక్తి గురించి ముందుగానే తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. శత్రువులతో స్నేహితులుగా జీవిస్తే జీవితం నాశనమైపోతుంది అంటాడు చాణక్యుడు. మరి, మనం చేసే స్నేహాలు మంచివో, చెడువో ఎలా తెలుస్తుంది? మంచి స్నేహితుడిని ఎంచుకోవడంలో వారిలో కొన్ని గుణాలను పరిశీలించాలని చెప్పాడు, అవేమిటో తెలుసుందాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఇలాంటి స్నేహితుడితో జాగ్రత్త

మీ ముందు మర్యాదగా మాట్లాడి, మీ వెనుక మీ గురించి చెడ్డగా మాట్లాడటం చేసే స్నేహితుడిని వదిలివేయడం మంచిది. అలాంటి మిత్రుడు పైన పాలు ఉన్న కుండలా ఉంటాడు కానీ లోపల విషం ఉంటుంది అని చాణక్యుడు అన్నాడు. కాబట్టి, మీ ముందు మర్యాదగా మాట్లాడి, వెనుక చెడు కోరుకునే వారితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు.

ఇలాంటి వ్యక్తులను మీ స్నేహితులుగా భావించవద్దు

మీ జీవితంలోని ముఖ్యమైన రహస్యాలు లేదా మీ జీవితంలోని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోని వ్యక్తి నిజమైన స్నేహితుడు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు తెలియజేసే స్నేహితుడితో మీరుయ్ స్నేహం చేస్తే, అతడు మిమ్మల్ని అగౌరవపరచవచ్చు లేదా తీవ్రమైన ఇబ్బందుల్లో నెట్టవచ్చు. మీ రహస్యాలను ఇతరులకు వెల్లడించే వ్యక్తి ఎప్పటికీ మీ స్నేహితుడు కాలేడు.

మీ స్నేహితులను గుర్తించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ జీవితాన్ని నాశనం చేసే సందర్భాలు ఉంటాయి.

ఇలాంటి స్నేహితుడు ఉండాలి

మీ కుటుంబం కష్టసుఖాలు తెలిసిన వాడు, మీరు చేసే వేడుకల్లో ఆనందంగా పాలుపంచుకునే వాడు, మీకు కష్టం వచ్చినపుడు వెనక నిలబడే వాడు నిజమైన స్నేహితుడు. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉండి, వారికి అండగా మీతో పాటు ఒక స్నేహితుడు నిలబడితే, అతను మీ నిజమైన స్నేహితుడు అని అర్థం చేసుకోండి. రెండవది, మీరు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే లేదా శత్రువు మిమ్మల్ని వెంటాడితే మీకు తోడుగా నేనున్నాన్ని ధైర్యం చెప్పేవాడు, మీ కష్టం నుంచి మిమ్మల్ని బయటకు లాగే ప్రయత్నం చేసేవాడు నిజమైన స్నేహితుడు. మృత్యువులో కూడా శ్మశానానికి తీసుకెళ్లడంలో సహకరించేవాడే నిజమైన మిత్రుడని చెప్పాడు. అలాంటి వారితో స్నేహం చేయాలి అంటాడు.

తదుపరి వ్యాసం