తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : జ్ఞాపకాలు మంచివైనా, చెడువైనా మోయాల్సిందే.. ఎందుకంటే..

Wednesday Motivation : జ్ఞాపకాలు మంచివైనా, చెడువైనా మోయాల్సిందే.. ఎందుకంటే..

29 June 2022, 9:14 IST

    • జీవితంలో మనం మంచి, చెడు రెండిటినీ చూస్తాము. ఒక్కోసారి మనకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందో కూడా తెలియదు. కానీ సరిగ్గా గమనిస్తే ప్రతి మంచిలోనూ చెడు ఉంటుంది. ప్రతి చెడులోనూ మంచి ఉంటుంది.
కోట్స్
కోట్స్

కోట్స్

Wednesday Motivation : మన లైఫ్​లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఇవి మనకు మంచినే గుర్తు చేస్తాయని లేదు. కానీ చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఈ మంచి జ్ఞాపకాలు మనకు లైఫ్​లో ముందుకు వెళ్లే ఆశని కలిగిస్తాయి. కానీ చేదు జ్ఞాపకాలు మనం జీవితంలో సమస్యలను ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాలో పాఠాలు నేర్పుతాయి. మనం సంతోషంగా గడిపిన ప్రతి నిముషం ఉత్తమమైన జ్ఞాపకాలు అని చెప్పవచ్చు. బాధలో ఉన్నప్పుడు అవి మనకు ఎంతో బూస్ట్​ని ఇస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

ఉత్తమమైన జ్ఞాపకాలను మనం మన కుటుంబం, స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు.. లేదా ఏదొక శుభసందర్భంలో వారితో షేర్ చేసుకుంటాం. మన అమ్మమ్మలు, తాతయ్యలు మనతో అలాంటి అనుభవాలనే షేర్ చేసుకుంటారు. అందుకే గొప్ప జ్ఞాపకాలు ఎప్పుడూ మన హృదయాల్లోనే పదిలంగా ఉంటాయి.

మరీ చెడు జ్ఞాపకాల పరిస్థితి ఏమిటి అంటే.. వాటిని కూడా మనం ఎప్పటికీ మరచిపోలేము. ఎందుకంటే అవి నేర్పించే పాఠలు మనం లైఫ్​లో ముందుకు వెళ్లడానికి సహాయం చేశాయి. మనం ఎంత పెద్ద సమస్యలను ఎదుర్కొని స్ట్రాంగ్​గా నిలిచామో.. రానున్న సమస్యలను కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని ఇస్తుంది. మనం సక్సెస్​ అయితే ఇతరులు మనల్ని అడిగే మొదటి ప్రశ్న.. మీరు ఆ సమస్యను ఎలా ఎదుర్కోగలిగారు.. ఇంత దూరం ఎలా రాగలరు అని అడుగుతారు.

బహుశా ఈ జ్ఞాపకాలు కనిపించేంత చెడ్డవి కావు. మంచి జ్ఞాపకాలు మనల్ని ఉత్సాహపరిచేందుకు కారణాలను ఇస్తాయి. కానీ చెడు జ్ఞాపకాలు విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తాయి. వీటి వల్ల మీరు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం