తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కేవలం బ్రష్‌తో పళ్లు తోముకోవడమే కాదు.. మెరుగైన నోటి శుభ్రత కోసం మార్గాలు ఇవిగో!

కేవలం బ్రష్‌తో పళ్లు తోముకోవడమే కాదు.. మెరుగైన నోటి శుభ్రత కోసం మార్గాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

20 March 2022, 7:55 IST

    • చల్లటి శ్వాసతో అందరూ మీ దగ్గరగా రావాలంటే మీ నోటి నుంచి దుర్వాసన రావొద్దు. అంటే నోటిని సరైన రీతిలో శుభ్రపరుచుకోవాలి. అప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగుటుంది. నొటి శుభ్రతకు మార్గాలివిగో..
Oral Health Tips -Representative Image
Oral Health Tips -Representative Image (Pixabay)

Oral Health Tips -Representative Image

శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకోవాలి, జుట్టును ఎలా శుభ్రపరుచుకోవాలి? అనే విషయాలు మనం తరచుగా చర్చించుకుంటాం, కానీ నోటి శుభ్రత ఎక్కువ చర్చలోకి రాదు. ప్రజలు తినడం పైన ఎంతటి ఆసక్తిని కనబరుస్తారో, నోటి శుభ్రతపైనా అంతే ఆసక్తిని కనబరచాలి. అది నిత్యకృత్యమై ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీరి అభిప్రాయం ప్రకారం, చాలా మంది పడుకునే ముందు పళ్ళు తోముకోరు. రాత్రి భోజనం చేసిన తర్వాత నోటిలో మిగిలిపోయిన ఆహార కణాలు అలాగే ఉండిపోయి సమయం గడిచేకొద్దీ పాచిపోతూ ఉంటాయి. దీంతో నోరు కూడా పాచిగా మారుతుంది. ఉదయం కూడా ఏదో మొక్కుబడిగా పళ్ళు తోముకుంటే అది నోటి దుర్వాసనకు దారితీస్తుంది. అలాగే చిగుళ్ళలో పుండ్లు పడటం, దంతాల రంగు మారడం, దంతాలు అరిగిపోయి ఏదైనా తినేటపుడు నరాలు జివ్వుమని లాగుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

దంతాల ఎనామెల్ సంరక్షణ, ఇతర ఓరల్ వ్యాధులు నివారించడానికి ప్రతిరోజు కనీసం రెండు సార్లు నోటిని శుభ్రపరుచుకోవాలని డెండిస్టులు సూచిస్తున్నారు.

ఇంకా ఎలాంటి మార్గాలను అనుసరించాలి?

రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం

చాలా మంది రోజులో ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తారు. ఎందుకంటే అదే వారి అలవాటు. అలా కాకుండా రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయం ఏదైనా తినడం లేదా తాగటం చేసే ముందర, అలాగే రాత్రి ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రపరుచుకుంటే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దుర్వాసన అనేదే ఉండకుండా తాజా శ్వాస లభిస్తుంది.

మీ నాలుకను శుభ్రం చేసుకోండి

కేవలం దంతాలను బ్రష్ చేయటమే కాకుండా నాలుకను శుభ్రపరుచుకోవాలి. ఇలా ఎంతమంది చేస్తారు? దంత క్షయం.. పుప్పి పళ్ళు నోటి దుర్వాసన, బలహీనమైన చిగుళ్ళు, ఎనామెల్ దెబ్బతినడం ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం నోటి లోపల వృద్ధి చెందే హానికరమైన బ్యాక్టీరియా. కాబట్టి టంగ్ క్లీనర్, బ్రష్ లేదా కాటన్ ప్యాడ్‌లతో నాలుకను శుభ్రపరచడం ప్రతిరోజూ చేస్తే చెడు బాక్టీరియా నాశనం అవుతుంది. నోరు, దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది.

మౌత్ వాష్

రాత్రి డిన్నర్ చేశాక బ్రష్ చేయడం ఇష్టం లేకపోతే కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఏదైనా మౌత్ వాష్‌తో నోటిని పుకిలించాలి. లేదా గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. రోజులో కనీసం రెండు సార్లు మౌత్ వాష్‌తో నోటిని కడుక్కోవడం చేస్తే అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి.

వాటర్పిక్‌తో నోటికి నీరు పట్టండి

మనం కుళాయి పైపుతో నీరుకొట్టి ఎలా అయితే ప్రదేశాలను శుభ్రపరుస్తామో వాటర్పిక్ ఉపయోగించి కూడా నోటిని అలా శుభ్రపరుచుకుంటే నోటి మూలమూలలా శుభ్రమవుతుంది. వాటర్పిక్ అనేది చిన్నపరికరం ఫార్మసీ షాపులలో లేదా ఆన్ లైన్ లో లభిస్తుంది. డెంటిస్టులు నోటిని శుభ్రంచేసేటపుడు ఇలాంటి పరికరం ఒకటి వాడతారు. దీనితో నోటిలోకి నీటిని స్ప్రే చేయడం ద్వారా దంతాల సందుల్లో ఉండే మిగిలిపోయిన ఆహార కణాలు, సూక్ష్మక్రిములు తొలగించుకోవచ్చు.

నోటిని శుభ్రం చేసుకుంటే దంతాలు మిలమిల మెరిసి మీకు అందమైన చిరునవ్వుని ఇస్తుంది. నోటి దుర్వాసన పోయి అందరు దగ్గర.. గారా అంటూ దగ్గరికి వస్తారు. నోటి సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారు.

తదుపరి వ్యాసం