తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spices In Cooking: ఈ మసాలాలు లేకుండా వంట చేయకండి.. రుచితో పాటూ ఆరోగ్యం కూడా..

Spices in cooking: ఈ మసాలాలు లేకుండా వంట చేయకండి.. రుచితో పాటూ ఆరోగ్యం కూడా..

HT Telugu Desk HT Telugu

11 June 2023, 14:14 IST

  • Spices in cooking: కూరల్లో తప్పకుండా వాడాల్సిన మసాలా దినుసులేంటో తెలుసుకోండి. వాటివల్ల కూర రుచి పెరగడంతో పాటూ, ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. 

వంటల్లో తప్పకుండా వాడాల్సిన మసాలాలు
వంటల్లో తప్పకుండా వాడాల్సిన మసాలాలు (Image by Bruno from Pixabay)

వంటల్లో తప్పకుండా వాడాల్సిన మసాలాలు

భారతీయ వంటలంటేనే మసాలాలు, నోరూరించే రుచులు. కూరలకు తాలింపు పెట్టడం, కొన్ని మసాలాలతో వంట చేయడం ఏళ్ల నుంచి వస్తోంది. భారతీయ వంటలకున్న నోరూరించే వాసనలు, గ్రేవీలు ప్రత్యేకంగా నిలబెట్టాయి. అనేక రకాల మసాలాలు వాడటం వల్ల ఆరుచి వస్తుంది.

ఏ మసాలాలు వాడాలంటే..

రిచ్‌గా, క్రీమీగా ఉండే కూరల నుంచి, తందూరీ చికెన్ వరకు వివిధ మసాలాలు వాడుతుంటాం. పకోడీలు, సమోసాల కోసం ఇంకాస్త విభిన్నమైన మసాలాలూ మేళవింపు వాడతాం. చట్నీలు, ఊరగాయల్లో మసాలాల ప్రాధాన్యం చెప్పక్కర్లేదు. రుచికే కాదూ వాటికున్న ఆయుర్వేద గుణాలు, ఆరోగ్యాన్నిచ్చే గుణాలు మన మసాలా దినుసుల్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఉదాహరణకు పసుపు తీసుకుంటే.. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. జీలకర్ర, ధనియాలు, అల్లం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శ్వాస సంబంధిత వ్యాధుల్ని తగ్గిస్తాయి.

మన కూరల్లో తప్పకుండా వాడాల్సిన 5 మసాలాలేంటో చూద్దాం. రుచితో పాటూ ఆరోగ్యానికీ మేలు చేస్తాయివి.

  1. పసుపు: అదే రంగులో ఉండే ఈ మసాలా వంటలకు మంచి రంగుతో పాటూ ఫ్లేవర్ ఇస్తుంది. దీనికున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపును కూరలు, పులావ్ లలోనే కాకుండా టీ కూడా చేసుకుని తాగొచ్చు.
  2. జీలకర్ర: కాస్త స్మోకీ ఫ్లేవర్ తో ఉండే దీన్ని దాదాపు ప్రతి వంటకంలో వాడాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. వాపు లక్షణాలను తగ్గిస్తుంది. కూరల్లో, మసాలాల్లో దీన్ని వాడటం వల్ల రుచి కూడా పెరుగుతుంది.
  3. ధనియాలు: కాస్త తియ్యగా మంచి వాసనతో ఉండే వీటి వల్ల ప్రత్యేక రుచి వస్తుంది. వీటి పొడి వాడటం వల్ల రుచితో పాటూ మంచి రంగు కూడా వస్తుంది. వీటికి కూడా వాపు లక్షణాలను తగ్గించే గుణాలున్నాయి. కూరల్లో, సలాడ్లలో కూడా ధనియాలు లేదా ధనియాల పొడి వాడటం తప్పకుండా అలవాటు చేసుకోవాలి.
  4. గరం మసాలా: బయట దొరికే మసాలాలు ఆరోగ్యానికి మంచివి కావు. కానీ ఇంట్లోనే జీలకర్ర, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు కలిపి పట్టుకున్న పొడిని వాడితే ఆరోగ్యం, రుచికరం.
  5. మెంతులు: చాలా మంది మెంతుల పొడి వాడందే కూరలు చేయరు. వాటివల్ల కూరకు వచ్చే రుచి అమోఘం. మాంసం వండేటపుడు, కూరల్లో దీన్ని వాడొచ్చు. మెంతులకుండే యాంటీ డయాబెటిక్ లక్షణాల వల్ల ఇది మధుమేహాన్ని నియంత్రించడంతో పాటే, వాపు లక్షణాలు తగ్గిస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం