తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : మీ లైఫ్​లో వారిని వదులుకుంటే.. మీకన్నా మూర్ఖులుండరు..

Tuesday Motivation : మీ లైఫ్​లో వారిని వదులుకుంటే.. మీకన్నా మూర్ఖులుండరు..

04 July 2022, 18:48 IST

    • ఈ రోజుల్లో నిజమైన ప్రేమను, నమ్మకమైన స్నేహితులను పొందడం చాలా కష్టం. ఇప్పుడున్న నకిలీ మనుషుల్లో వీరిని వెతుక్కోవడమంటే సాహసమనే చెప్పాలి. అయితే ఇలాంటి వాళ్లు మీ లైఫ్​లోకి వస్తే వారిని మాత్రం అస్సలు వదులుకోవద్దు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Tuesday Quote : ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కూడా ఈజీనే అనొచ్చేమో.. కానీ నిజమైన ప్రేమను, నమ్మకమైన స్నేహితులను పొందడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బును సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం వాటిని కనుగొనడం ఆలస్యం అవుతుందేమో కానీ.. ఏదోరకంగా డబ్బును సంపాదించవచ్చు. కానీ మనల్ని నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తులను, మనతో నమ్మకంగా ఉంటూ.. మనల్ని వెన్నంటి ప్రోత్సాహించే వ్యక్తులను కనుగొనడం మాత్రం చాలా కష్టం. నిజం చెప్పాలంటే నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ.. నమ్మకంగా, ఏమి ఆశించకుండా మన తోడుగా నిలిచే స్నేహితులే మనకు నిజమైన సంపదలు.

ట్రెండింగ్ వార్తలు

Male Infertility : మీ స్మార్ట్ ఫోన్ ఈ ప్రదేశంలో పెడితే సంతానోత్పత్తి సమస్యలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

ఇలాంటివారు చాలా అరుదుగా మన లైఫ్​లోకి వస్తారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. వారిని సంతోషంగా, సంతృప్తిగా ఉంచేందుకు తగినంత కృషి చేయండి. మీరు వారిని సంతోషపెట్టగలిగితే.. వారు మిమ్మల్ని మరింత హ్యాపీగా చూస్తారు. మునుపెన్నడు లేనంత ఆనందంగా మీరు ఉండగలుగుతారు. మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు. మీ సంతోషంతో పాటు బాధలోనూ మీ తోడుగా ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు వదిలిపోకుండా.. మీ మీద నమ్మకం ఉంచి.. మీరు ముందుకు సాగేలా చేస్తారు. అందుకే వీరు మీ జీవితంలో చాలా విలువైన వారని గుర్తించాలి.

ముఖ్యంగా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టమైపోతుంది. ప్రేమను నటించేవాళ్లే ఎక్కువైపోయారు. అయితే మీ జీవితంలో మిమ్మల్ని బేషరుతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటే.. వారిని ఎప్పటికీ విడిచిపెట్టకండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ జీవితంలోని పరిస్థితుల కారణంగా మీరే వారిని వదిలేసుకుంటారు. కానీ అలా చేస్తే.. అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. మీరు నిజమైన ప్రేమను విడిచిపెడితే.. జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. కాబట్టి వారిని వదులుకోకుండా ఉండేందుకు వీలైనంత ప్రయత్నించండి. పరిస్థితులు ఎప్పటికైనా మారుతాయి. కానీ మీరు వదులుకునే వ్యక్తులు మళ్లీ రేపు దొరుకుతారా అంటే చెప్పలేం. అందుకే పరిస్థితుల కోసం నిజమైన ప్రేమను వదులుకోకండి.

నమ్మకమైన స్నేహితుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీకు నమ్మకమైన స్నేహితులు ఉంటే.. మీలైఫ్ మామూలుగా ఉండదు. మీరు బాధల్లో ఉంటే వారు మిమ్మల్ని బయటకు లాగుతారు. సంతోషంగా ఉంటే మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కాబట్టి వారి నమ్మకాన్ని మీరు విచ్ఛిన్నం చేయకండి. వారు మన జీవితంలో అత్యంత విలువైన వారిలో ఒకరు. మీరు లైఫ్​లో సంతోషంగా ఉండాలనుకుంటే.. మీ నిజమైన ప్రేమను, నమ్మకమైన స్నేహితులను ఎప్పటికీ విడిచిపెట్టకండి. వారితో ఉంటే.. మీరు చాలా హ్యాపీగా ఉంటారు.

టాపిక్

తదుపరి వ్యాసం