తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Today Horoscope | మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి.. ఎందుకంటే..

Today Horoscope | మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి.. ఎందుకంటే..

HT Telugu Desk HT Telugu

27 May 2022, 6:42 IST

    • ప్రతి ఒక్కరికి లైఫ్​లో ప్రేమ ముఖ్యమైనది. ప్రేమ జీవితం సరిగా ఉంటే.. అన్ని విషయాలలో విజయం సాధించవచ్చు. మరి మీ విషయంలో ప్రేమ కాంప్లికేటడ్​గా ఉందా? మీ భాగస్వామితో సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అనుకుంటున్నారా? అయితే రాశుల ప్రకారం మీ ప్రేమలో ఎలాంటి ట్విస్ట్​లు ఉన్నాయో తెలుసుకుని.. ముందుకు వెళ్లిపోండి. చంద్రమానం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
రాశుల ఫలితాలు
రాశుల ఫలితాలు

రాశుల ఫలితాలు

మేషం: మీరు ఈరోజు మీ భాగస్వామితో మాట్లాడకుండా తప్పించుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు నిజాయితీగా ఉంటే.. రోజు చాలా సాఫీగా సాగుతుంది. మీరు ఏదైనా విషయంలో నిజాయితీగా ఉండకపోతే.. మీ భాగస్వామి మనసులో మీపై ఓ ముద్ర పడిపోతుంది. వీటన్నింటి ఇంపాక్ట్ మీపై చాలా దారుణంగా ఉండబోతుంది.

ట్రెండింగ్ వార్తలు

Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

ICMR On Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది.. తగ్గేందుకు టిప్స్

Mandaram Health Benefits : జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా మందారం పువ్వుతో అనేక లాభాలు

Honey and Aloe Vera Gel : ముఖం, మెడపై ఒక వారంపాటు తేనె, కలబంద జెల్ రాస్తే మెరిసిపోతారు

వృషభం: మీరు రోజు చాలా సంతోషంగా ఉంటారు. మీరు ప్రస్తుతం కలిగి ఉన్న అదృష్టాన్ని, ఆనందాన్ని.. మీ భాగస్వామి కూడా అనుభవించాలని కోరుకుంటున్నారా? అయితే వారిని ఓ మంచి ప్రదేశానికి తీసుకెళ్లండి. మంచి రొమాంటిక్ వాతావరణం కోసం వెతుకుతున్నట్లయితే.. బలమైన కళాత్మక ప్రకంపనలు ఉన్న ప్రదేశాలలో మీరు వాటిని కనుగొనవచ్చు.

మిథునం: వ్యక్తుల మధ్య సంబంధాలకు సంబంధించిన అనేక రకాల కార్యకలాపాలకు ఈ రోజు అద్భుతమైన రోజుగా మారే అవకాశం ఉంది. మీరు మరొక వ్యక్తి పనిని మెచ్చుకునే సమయంలో ఉన్నప్పుడు మీ మధ్య ప్రేమ చిగురించే అవకాశం ఉంది. మొదటి చూపులో మీరు ఏదో అసాధారణమైన అనుభూతిని పొందవచ్చు. లేదా సహజమైన కనెక్షన్‌ని మీరు పొందవచ్చు.

కర్కాటకం: ఇది ఒక శకానికి ముగింపు. మరో అద్భుతమైన కొత్త ప్రారంభం. మీరు నిర్దిష్ట వ్యక్తితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే.. దానిలోకి ప్రవేశించే కొత్త ప్రభావాలకు అనుగుణంగా ఉండాలి. ఇంతకు ముందు ఉన్నట్లే మీ సంబంధం ఇప్పుడు ఉండదు. మీరు ధోరణిని మార్చుకోకుంటే.. మీ ప్రేమ విజయవంతం కాకపోవచ్చు.

సింహం: మొదట మీరే ప్రేమలో ఎందుకు పడ్డారో అనే ప్రశ్న మీలో మొదలవుతుంది. దానికి సమాధానం అంత ఈజీగా దొరకకపోవచ్చు. ఈ మథనం నుంచి బయటపడటానికి ఓ మార్గం ఉంది. కానీ అది తికమక పెట్టే సమస్యతో ముడిపడి ఉంది. దానికి కారణాలు ఏవైనా.. వాటి గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీ సొంత ఆలోచనపై దృష్టి పెట్టాలి.

కన్య: మీరు మీ బంధం విషయంలో చాలా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో మీ భాగస్వామి నుంచి కాస్తైనా గుర్తింపు, కృతజ్ఞత కావాలి. మీ ఎఫర్ట్స్​ని మీ భాగస్వామి గుర్తించాలనుకోవడంలో తప్పులేదు. ఈ విషయం మీరు వ్యక్తం చేసినా.. ఎటువంటి ప్రతికూలత ఉండదు. మీ భాగస్వామి దానిని అర్థం చేసుకుని మీకు సహాయం చేస్తారు. ఇది మీరు మానసికంగా సంతోషంగా ఉండేందుకు సహాయం చేస్తుంది.

తుల: మీరు మీ ప్రేమను వ్యక్తం చేయడంలో ఇంక ఆలస్యం చేయకూడదు. ఇంకా సమయం కోసం వేచి చూస్తే.. ఆ వ్యక్తి మీకు దూరమయ్యే అవకాశం ఉంది. వారికి మీ ప్రేమను చెప్పలేక.. దూరం అవ్వాలని మీరు అనుకోవచ్చు కానీ.. మీరు మెల్లిగా వారికి ఇంకా ఆకర్షితులయ్యారు. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రేమను వారి దృష్టికి తీసుకెళ్లండి. మంచి ఫలితాలు వస్తాయి.

వృశ్చికం: మీకు.. మీ జీవిత భాగస్వామికి ఇంటి వాతావరణం విషయంలో.. గొడవ జరగవచ్చు. వాస్తవానికి అది చాలా చిన్న కారణం. కాబట్టి మీ ముఖ్యమైన వ్యక్తి సమీపంలో ఉన్నప్పుడు.. ఇంటి పనులపై మీ శ్రద్ధ మరింత ఎక్కువ అవసరం. మీకు వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాంటప్పుడు మీ ప్రేమ జీవితం సాఫీగా సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ధనుస్సు: ముఖ్యమైన వ్యక్తితో కొంత సమయాన్ని పంచుకోవడం వల్ల మీరు ఒత్తిడిని మరచిపోయే అవకాశముంది. సంబంధం లేని విషయాలను చర్చించే మానసిక స్థితిలో మీరు లేరు. మీరు కలిసి ఉన్న మంచి సమయాన్ని ఆస్వాదించడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. తద్వారా సంబంధం చాలా కాలం పాటు కొనసాగుతుంది.

మకరం: మీ సహజమైన సామర్థ్యాల కారణంగా.. మీ భాగస్వామి మీతో మనసు విప్పి.. వారి భావోద్వేగాలను చర్చిస్తూ మరింత సుఖంగా ఉంటారు. మీరు ఒక శక్తివంతమైన సాధనమని వారు నమ్ముతారు. ఇది మీకు మంచిగా అనిపిస్తుంది. వారి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. మీరు భాగస్వామితో సంతోషకరమైన అనుభవాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి.

కుంభం: మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడిపేందుకు అనుకూలిస్తున్న పరిస్థితులను సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ దొరకదు. ఈ రోజుల్లో జంటలు ఒకరికొకరు చాలా ప్రశాంతత, స్థిరత్వాన్ని అనుభవిస్తున్నారని.. ప్రస్తుత సమయంలో వారికి అనుకూలిస్తున్న పరిస్థితులతో సంతృప్తి చెందుతున్నారని మీరు గమనించవచ్చు. కాబట్టి మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి.

మీనం: ఈ రోజు కొత్త సమాచారానికి ప్రతిస్పందనగా మీ అభిప్రాయాలు త్వరగా, ఊహించని విధంగా మారతాయి. అసలు నిజం ఏమిటో గుర్తించడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. మీ బంధం వర్థిల్లాలని మీరు కోరుకుంటే.. వాటిని మరచిపోయేందుకు ప్రయత్నించండి. ఇదే తెలివైన చర్య. లేదంటే అనవసరమైన ప్రశ్నలు మీ మనసును పాడు చేస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం