తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Horoscope | ఓ వ్యక్తితో డేట్ చేయడానికి.. మీరు ఏమి చేయడానికైనా సిద్ధపడతారు

Love Horoscope | ఓ వ్యక్తితో డేట్ చేయడానికి.. మీరు ఏమి చేయడానికైనా సిద్ధపడతారు

HT Telugu Desk HT Telugu

26 May 2022, 6:36 IST

    • ప్రతి ఒక్కరికి లైఫ్​లో ప్రేమ ముఖ్యమైనది. ప్రేమ జీవితం సరిగా ఉంటే.. అన్ని విషయాలలో విజయం సాధించవచ్చు. మరి మీ విషయంలో ప్రేమ కాంప్లికేటడ్​గా ఉందా? మీ భాగస్వామితో సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అనుకుంటున్నారా? అయితే రాశుల ప్రకారం మీ ప్రేమలో ఎలాంటి ట్విస్ట్​లు ఉన్నాయో తెలుసుకుని.. ముందుకు వెళ్లిపోండి. చంద్రమానం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
రాశుల ఫలితాలు
రాశుల ఫలితాలు

రాశుల ఫలితాలు

మేషం: మీ భాగస్వామి కొంత విరోధంగా మారే అవకాశం ఉంది. అందువల్ల కొనసాగుతున్న సవాళ్లను చర్చించడం అవసరం. ఇది విషయాలను ధైర్యంగా మాట్లాడటానికి, మీ లక్ష్యాలను స్పష్టం తెలియజేయడానికి సహాయం చేస్తుంది. వాటి వల్ల తలెత్తే అపార్థాలను నివారించడంలో మీకు సహాయపడుతుంది. ఒకరికొకరు మీ సున్నితత్వాన్ని పెంచుకోండి. నమ్మకంతో ఉండండి.

వృషభం: ఈరోజు మీరు ఆసక్తిగా, ఉత్తేజకరమైన దృక్పథాన్ని కలిగి ఉన్న ఇతర వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడే ఈవెంట్‌కి వెళితే.. వారితో మీరు ఎలా కనెక్ట్ అవుతారో చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతులేని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కూడా మీరు కనుగొనవచ్చు.

మిథునం: మీరు, మీ భాగస్వామి చాలా కాలంగా ఒకే విషయంపై ఎక్కువ ఆలోచిస్తున్నట్లు మీకు అనిపిస్తే.. దానికి పరిష్కారం పొందడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆలోచనా చర్య నిస్సహాయంగా కనిపించిన.. పరిస్థితిపై వెలుగునిస్తుంది. అంతేకాకుండా పరిష్కారం కనుగొనడం సాధ్యపడుతుంది.

కర్కాటకం: ముఖ్యమైన వ్యక్తులతో జరిగే సంభాషణలు తారా స్థాయికి చేరుకుంటాయి. వారు సమస్యను అర్థం చేసుకోవట్లేదనే అభిప్రాయానికి మీరు వచ్చేస్తారు. ఈ విషయంలో మీరు, మీ భాగస్వామి ఒక అడుగు వెనక్కి తీసుకోవాలి. మీ సంబంధంలోని ఉద్రిక్తతను ఆబ్జెక్టివ్ పాయింట్ నుంచి చూడాలి. మీ సంబంధాన్ని ఒక ఉత్తేజకరమైన ప్రయాణంగా చూడండి.

సింహం: మీరు శ్రద్ధ వహించే వారితో ఈరోజు మీరు నిర్దిష్ట చర్చ చేస్తారు. ఈ క్రమంలో వారు మిమ్మల్ని నిర్దేశించని ప్రాంతం వైపు మళ్లించవచ్చు. మీరు అవసరం లేని విషయాలు, అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. కానీ అకస్మాత్తుగా ఒక సరికొత్త ఆలోచనా విధానం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది మిమ్మల్ని నిర్దేశించని అంశాలవైపు మళ్లిస్తుంది.

కన్య: ఈ రోజు.. మీ హృదయ స్పందన రేటును వేగవంతం చేసే అవకాశం ఉంది. నిర్దిష్ట వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ రోజు పూర్తిగా కొత్త కోణాన్ని సంతరించుకోబోతోంది. వారి ప్రభావం మీపై నిస్సందేహంగా.. చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. రాబోయే వారి కోసం సిద్ధంగా ఉండండి.

తుల: ఈ రోజు మీ ప్రియమైన వారితో కలిసి కొంత ప్రశాంతంగా గడపడం వల్ల మీ మధ్య కొత్త సామీప్య భావన ఏర్పడుతుంది. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ పెంచుకుంటే.. మీ సంబంధం నాణ్యత మెరుగుపడుతుంది. హృదయపూర్వకంగా మాట్లాడటం, మనస్సును రిలాక్స్​గా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఉంచుకోండి.

వృశ్చికం: మీరు ఈ రోజు చాలా భావోద్వేగానికి లోనవుతారు. మీరు చెప్పేదానిపై మీ భాగస్వామి శ్రద్ధ వహించాలని కోరుకుంటారు. మీరు, మీ భాగస్వామి మధ్య కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి మీ ఇద్దరినీ ఉత్సాహంగా ఉంచుతాయి. మీ భాగస్వామికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మీ రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.

ధనుస్సు: ఈ రోజు పూర్తిగా మీ నిజమైన ప్రేమతో గడిపిన మరపురాని క్షణాలతో నిండి ఉంటుంది. ఈ వ్యక్తి పట్ల మీ ప్రేమను ఉద్వేగభరితమైన రీతిలో ప్రకటించాలనే బలమైన కోరిక మీలో ఉంటుంది. మీరు, మీ ముఖ్యమైన వ్యక్తి కలిసి డిన్నర్​కి వెళ్లే అవకాశముంది. అంతేకాకుండా.. ఆనందించే, శృంగార కార్యకలాపాలలో మీరు పాల్గొనవచ్చు.

మకరం: కొత్త శృంగార సంబంధం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అయితే మీ ప్రస్తుత సంబంధానికి హాని కలిగించేది మీరు ఏదీ చేయకూడదు. ఇతరులతో మీరు సన్నిహతంగా ఉండే విషయాలు మీ భాగస్వామికి తెలిసే అవకాశముంది. ఇది ఖచ్చితంగా వారికి మీపై అనుమానాన్ని రేకెత్తిస్తుంది. మీ భాగస్వామి భావాలకు కాస్త గౌరవం ఇవ్వండి.

కుంభం: మీరు ఒక నిర్దిష్ట వ్యక్తి పట్ల చాలా ఆకర్షితులయ్యారు. వారితో డేట్​ చేయడం కోసం మీరు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీ హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తికి వారు నిజంగా మీ ప్రేమకు అర్హులని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో చొరవ తీసుకోండి. కానీ మొండిగా ఉండకుండా మీ వంతు కృషి చేయండి.

మీనం: ఈ రోజు మీరు మీ సొంత గుర్తింపును కాపాడుకుంటూ.. మీరు ఇష్టపడే వ్యక్తితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. మీ సున్నితత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. భావోద్వేగ స్థాయిలో.. వారిని మీరు మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ బహిరంగ, నిజాయితీతో కూడిన సంభాషణ మీకు మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం