తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Things To Expect In A Relationship: మీ బంధం బాగుండాలంటే వీటికి మించి ఆశించకండి

Things to expect in a relationship: మీ బంధం బాగుండాలంటే వీటికి మించి ఆశించకండి

HT Telugu Desk HT Telugu

31 January 2023, 12:26 IST

    • Things to expect in a relationship: రిలేషన్‌షిప్‌లో అన్నీ ఆశించలేం. ఏవి ఆశించవచ్చో తెలుపుతూ థెరపిస్ట్ చేసిన సూచనలు మీకోసం.
Things to expect in a relationship: బంధంలో ఏవేవీ ఆశించవచ్చు
Things to expect in a relationship: బంధంలో ఏవేవీ ఆశించవచ్చు (Imagesbazaar)

Things to expect in a relationship: బంధంలో ఏవేవీ ఆశించవచ్చు

రిలేషన్‌షిప్ ఎప్పుడూ టూ వే రోడ్డే. ఆరోగ్యకరమైన బంధంలో హద్దులూ అవసరమే. అలాగే కమ్యూనికేషన్ కూడా అవసరం. దీని ద్వారా మనం ఆ బంధంలో ఆశించే విషయాలపై స్పష్టత వస్తుంది. హద్దులు దాటిన విషయాల వల్లే ఎక్కువసార్లు బంధాలు బీటలు వారుతాయి. అపార్థాలు, గొడవలు, అంతిమంగా బంధం వీడిపోతుంది. ఒక బంధంలో మనం ఎలాంటివి ఆశించవచ్చో మనకు స్పష్టత ఉంటే మనం ఆ బంధాన్ని ఆరోగ్యకరంగా మలుచుకోవచ్చు. మీకు, మీ భాగస్వామికి తగినంత స్పేస్ లభించడం వల్ల వారు వ్యక్తిగతంగా ఎదగడానికి, కలిసి ఎదగడానికి సాధ్యపడుతుంది. బంధం అంటే ఇద్దరు వ్యక్తుల సుదీర్ఘ ప్రయాణం. దీనికి ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్, అర్థం చేసుకోవడం, అంచనాలపై అవగాహన, ఇంధనం లాంటివి. ఇవి ఉంటేనే మీ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

సైకో థెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ దీనికి పరిష్కారం చూపుతూ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో సంబంధిత విషయాలపై చర్చించారు. ‘ఇప్పుడు బంధంలో ఉన్న వారు ఒకసారి నిలిచి చూడండి. మీరు మీ పార్ట్‌నర్‌కు ఏమిస్తున్నారో చూడండి. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది..’ అని చెబుతూ ఒక బంధంలో ఎలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయచ్చో సూచించారు.

యాక్షన్స్: ఒక బంధం రెండు భావోద్వేగాలు కనెక్ట్ అయ్యే చోటు. భాగస్వామి చర్యలు, మాటలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో వారు అర్థం చేసుకోవాలని మనం ఆశించవచ్చు. 

ఆప్యాయత: చిరు ఆప్యాయత, మెచ్చుకోలు కూడా మీ బంధం దీర్ఘకాలం పటిష్టంగా ఉండేలా చేస్తుంది. ఒక బంధంలో ఉన్న వారు పరస్పరం తమదైన శైలిలో ప్రేమను వ్యక్తీకరిస్తూ ఆప్యాయతను చూపడాన్ని ఆశించడం సబబే.

టైమ్: ఒక బంధంలో ఉన్న వారు సమయ పాలన పాటించడం అవసరం. ఉమ్మడిగా సమయం గడిపినప్పుడైనా,  లేదా విడిగా వారి వారి పనుల్లో నిగమ్నగమైనప్పుడైనా సమయ పాలన చాలా ముఖ్యం.

ఆసక్తి: ఒక బంధంలో ఉన్న వారు పరస్పరం వారి సహజ స్వభావాలు, అభిరుచులు, అలవాట్లపై ఆసక్తి చూపాలి.

కరుణ: ఒక బంధంలో ఉండాల్సిన అతి ముఖ్యమైన చర్య ఇది. భాగస్వామి పట్ల కరుణతో వ్యవహరించాలి. అన్ని సందర్భాల్లోనూ దీనిని మరిచిపోరాదు. వారికి అసౌకర్యం కలిగేలా చూడొద్దు.

నమ్మకంగా ఉండాలి: ఒక బంధ:లో విధేయత చాలా ముఖ్యం. బంధానికి అది పునాది. భాగస్వామి కూడా అలాగే ఉండాలని ఆశించవచ్చు.

భేదాభిప్రాయాలు: బంధంలో సంఘర్షణ, భేదాభిప్రయాలు అత్యంత సహజం. అయితే దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఫలితం ఆరోగ్యకరంగా, గౌరవప్రదంగా ఉండాలి.

టాపిక్

తదుపరి వ్యాసం