Love Horoscope : మీ సంబంధాన్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటే.. కమ్యూనికేషన్ తప్పదు గురు-today horoscope based on love and relationship for 28th june 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Horoscope : మీ సంబంధాన్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటే.. కమ్యూనికేషన్ తప్పదు గురు

Love Horoscope : మీ సంబంధాన్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటే.. కమ్యూనికేషన్ తప్పదు గురు

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 28, 2022 06:49 AM IST

ప్రతి ఒక్కరికి లైఫ్​లో ప్రేమ ముఖ్యమైనది. ప్రేమ జీవితం సరిగా ఉంటే.. అన్ని విషయాలలో విజయం సాధించవచ్చు. మరి మీ విషయంలో ప్రేమ కాంప్లికేటడ్​గా ఉందా? అయితే రాశుల ప్రకారం మీ ప్రేమలో ఎలాంటి ట్విస్ట్​లు ఉన్నాయో తెలుసుకుని.. ముందుకు వెళ్లిపోండి. చంద్రమానం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

<p>రాశుల ఫలితాలు</p>
రాశుల ఫలితాలు

మేషం: మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈరోజు మీరు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. మీరు అహంకారం, మీ అవసరాల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మీ భాగస్వామిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించండి. మీ ప్రేమ జీవితం గురించి స్నేహితుల నుంచి సలహాలు తీసుకోండి.

yearly horoscope entry point

వృషభం: మీరు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నా లేదా ఎవరిగురించైనా తెలుసుకోవడం ప్రారంభించినా.. కాస్త నెమ్మదించండి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విషయాలు ఎలా ఉండాలనే దానిపై మీరు ఆత్రుతగా కంటే.. మీరు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. కాలమే అన్ని ప్రశ్నలకు దారి చూపిస్తుంది.

మిథునం: ఈరోజు మీ శృంగార దృక్పథం మారవచ్చు. మీ ఆలోచనలు, భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు. మీరు మీ బంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

కర్కాటకం: ఈ రోజు మీ శృంగార జీవితంలో సంతోషకరమైన మార్పు రావచ్చు. మీ ప్రేమికుడితో సమయం గడపడం వల్ల తీవ్రమైన భావోద్వేగ ప్రతిస్పందన రావచ్చు. ఎక్కువ శ్రమ పడకుండానే మీరు కోరుకున్నది సాధించడం మంచిది.

సింహం: ఆరోగ్యకరమైన సంబంధంలోకి వెళ్లాలనుకున్నప్పుడు మీరు ఎంత ఎక్కువ మంది వ్యక్తులతో సంభాషిస్తే.. మీ విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీరు సంబంధంలో ఉన్నప్పటికీ.. మీ జీవితంలో మీకు మార్గనిర్దేశం చేయగల, ప్రేమ గురించి సలహా ఇవ్వగల ఇతర వ్యక్తులు మీకు ఇంకా అవసరం.

కన్య: ఈరోజు మీరు మీ భాగస్వామితో చాలా ఓపెన్​గా మాట్లాడుతారు. మీ శృంగార జీవితం అభివృద్ధి చెందడానికి దాదాపు అనంతమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఓ మంచి రోమాంటిక్ డేట్ ప్లాన్ చేసుకోండి.

తుల: ఈరోజు మీ భాగస్వామితో వాదించకండి. ఎందుకంటే గొడవలు మీ కనెక్షన్‌పై ఒత్తిడిని కలిగిస్తాయి. సంబంధంలో మీ భాగస్వామి పట్ల మరింత అనుకూలమైన వైఖరిని చూపించండి. మీ ప్రియురాలి పట్ల ప్రేమ, ఆప్యాయతను ప్రదర్శించండి.

వృశ్చికం: మీ భాగస్వామి మానసిక స్థితిని చదవడం నేర్చుకోండి. వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. మీ భాగస్వామితో ఆనందంగా గడపాలంటే.. ముందుగా మీ స్వభావాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. ఏ విషయాలనైనా వెంటనే కన్ఫార్మ్ చేసుకోకండి.

ధనుస్సు: మీ భాగస్వామికి సమయాన్ని కేటాయించండి. ముఖ్యమైన వారిపై ఎక్కువ శ్రద్ధ చూపితే.. అది వారు మీతో మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది. సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఈ స్థాయి కమ్యూనికేషన్‌ అవసరం.

మకరం: ప్రస్తుతం జరిగే గొడవల్లో మీ భాగస్వామితో మీరు నిజం చెప్పడం మంచిది. అది అంతిమంగా మీపై విశ్వాసాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. వారి పట్ల మీకున్న ప్రేమను తెలియజేయడానికి మీరు ఎంచుకునే మార్గాల పట్ల మీ భాగస్వామి ఆశ్చర్యపోతారు.

కుంభం: మీరు చాలా కాలంగా కోల్పోయిన శృంగార భాగస్వామి లేదా రహస్య ప్రేమను కలిగి ఉన్న వారితో టచ్​లోకి వెళ్లండి. ఇది మిమ్మల్ని అదుపులో ఉంచుతుంది. మీరు ఈ వ్యక్తిని మళ్లీ కలుసుకునే అవకాశాన్ని వస్తే వదులుకోకూడదు. మీ మధ్య కెమిస్ట్రీ ఇంకా ఉందో లేదో తెలుసుకోండి.

మీనం: మీరు శృంగార భాగస్వామి కోసం వెతుకుతున్నట్లయితే.. త్వరలోనే మీకు ఒకరు దొరుకుతారు. మీరు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఈ వ్యక్తిని కలుసుకునే అవకాశముంది. ఈ వ్యక్తి చాలావరకు విదేశీ పౌరుడు. వారు చాలా చమత్కారమైన రీతిలో మిమ్మల్ని సంప్రదిస్తారు. దీనివల్ల మీరు వారి ప్రేమలో పడతారు.

Whats_app_banner

సంబంధిత కథనం