తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sweat Reduce | చెమటను తగ్గించుకోవాలంటే.. ఇవి తీసుకోవాల్సిందే..

Sweat Reduce | చెమటను తగ్గించుకోవాలంటే.. ఇవి తీసుకోవాల్సిందే..

23 March 2022, 13:32 IST

    • ఇది వేసవికాలం. ఈ కాలంలో మామిడిపండ్లతో పాటు.. మరెన్నో వాటికి సమయం కావొచ్చు. కానీ ఇది మండే సూర్యుడితో పాటు చెమటను కూడా తెచ్చే కాలం. వేడి, పొడి, తేమ, సూర్యరశ్మికి గురికావడం వల్ల మీ శరీరం ఎక్కువ చెమట పట్టేలా చేస్తుంది. ఇది మీ శరీరం నుంచి దుర్వాసనకు కూడా దారి తీస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ఆహారాలు ఉపయోగడతాయని మీకు తెలుసా? చెమటను తగ్గించే ఆహారాలు ఏంటో ఇప్పుడుతెలుసుకుందాం.
చెమటను తగ్గించుకునే చిట్కాలు
చెమటను తగ్గించుకునే చిట్కాలు

చెమటను తగ్గించుకునే చిట్కాలు

Sweat Reduce |వేసవి వచ్చేసింది కాబట్టి విపరీతమైన చెమటలు పట్టడం మొదలై ఉంటుంది. చెమట వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా శరీరం నుంచి దుర్వాసన రావడం కూడా మొదలవుతుంది. దీని వల్ల కలిగే చిరాకు అంతా ఇంత కాదు. మరి దానిని తగ్గించుకునేందుకు ఏమి మార్గాలు లేవా అంటే ఉన్నాయి. ఆహారం ద్వారా కూడా చెమటను తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు.

హైపర్​హైడ్రోసిస్​ అనే అధిక చెమట సమస్య ఉన్నవారికి వేసవికాలం మరింత దుర్భలంగా ఉండవచ్చు. వారు రోజుకు కనీసం రెండుసార్లు తలసాన్నం చేయాల్సి ఉంటుందంటున్నారు డైటీషియన్ హరిలక్ష్మి. దానిని అదుపులో ఉంచుకోవడానికి యాంటిపెర్స్పిరెంట్‌లను పూయాలి. అయినప్పటికీ.. మీరు తీసుకునే ఆహారం కూడా మీరు ఉత్పత్తి చేసే చెమట పరిమాణంపై ప్రభావం చూపుతుందని చాలామందికి తెలియదని హరిలక్ష్మి తెలిపారు. చెమటను తగ్గించడంలో, శరీర దుర్వాసనను మెరుగుపరచడంలో కూడా ఆహారం సహాయం చేస్తుందని స్పష్టం చేశారు.

చెమట పట్టడానికి కారణాలు

* మధుమేహం

* మెనోపాజ్ హాట్ ఫ్లాషెస్

* ఇన్ఫెక్షన్ (అథ్లెట్స్ ఫుట్ - ఫంగల్ ఇన్ఫెక్షన్)

* తక్కువ రక్త చక్కెర

* థైరాయిడ్ సమస్యలు

* లుకేమియా

* కొన్ని మందుల దుష్ప్రభావాలు

* ఒత్తిడి, ఆందోళన, నిరాశ

* పరిశుభ్రత సమస్యలు

ఎక్కువ చెమటలు పట్టడం వల్ల చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దాని పరిష్కారాన్ని కనుగొనడం చాలా అవసరం. మీ శరీర వాసనను మెరుగుపరచడానికి, చెమటను తగ్గించేందుకు ఈ 6 ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1. నీరు

తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది. అధిక చెమట కారణంగా వచ్చే డీహైడ్రేషన్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

2. అధిక ఫైబర్

వోట్స్, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెరుగైన జీర్ణక్రియ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. చెమటను తగ్గిస్తుంది.

3. ఆలివ్ నూనె

మీ ఆహారాన్ని వండడానికి ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల జీవక్రియ, జీర్ణక్రియను కూడా పెంచుతుంది. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఉష్ణోగ్రత పెరుగుదలను నివారిస్తుంది. చెమటను నియంత్రిస్తుంది.

4. పండ్లు

యాపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయలు, పైనాపిల్స్, నారింజ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు మీ చెమట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా, నారింజ, నిమ్మకాయలు, పైనాపిల్స్ వంటి సిట్రస్ పండ్ల సహజ వాసన శరీరం శోషించబడుతుంది. మీ చర్మానికి తాజా వాసనను ఇస్తుంది.

5. కూరగాయలు

దోసకాయలు, పాలకూర, ఎర్ర క్యాబేజీ, బచ్చలికూర వంటి కూరగాయలను మీరు మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి నీటితో దట్టంగా ఉంటాయి. అంతే కాకుండా చెమట స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

6. గ్రీన్ టీ

వేడి పానీయాలు తాగడం ప్రతికూలంగా అనిపించవచ్చు. కానీ గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నాడీ వ్యవస్థను చల్లగా ఉంచడంలో, చెమటను అదుపులో ఉంచడంలో ఇది సహాయం చేస్తుంది.

వేటిని తీసుకోకూడదు..

కెఫిన్, ఆల్కహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ వస్తువులు నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, పునరుజ్జీవింపజేస్తాయి. ఈ క్రమంలో శరీరం అధికంగా ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల చెమట పరిమాణం పెరుగుతుంది.

తదుపరి వ్యాసం