తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Languages : ప్రేమ భాషలు 5 రకాలు.. అందులో మీరు ఏ రకం?

Love Languages : ప్రేమ భాషలు 5 రకాలు.. అందులో మీరు ఏ రకం?

Anand Sai HT Telugu

04 January 2024, 10:08 IST

    • 5 Love Languages : ప్రేమను వ్యక్త పరిచేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. సాధారణంగా ప్రేమ భాషలు 5 ఉన్నాయి. అందులో మీరు ఏ రకం అని డిసైడ్ చేయండి.
ప్రేమ భాషలు
ప్రేమ భాషలు

ప్రేమ భాషలు

ప్రేమ అంటే మాట్లాడటం ఒకటే కాదు.. ప్రేమించడం అంటే కేవలం ఐ లవ్ యూ అని చెప్పుకోవడం మాత్రమే కాదు. ప్రేమించిన వ్యక్తికి అన్ని ఇచ్చుకోవడం.. వారి బాధను పంచుకోవడం.. ప్రతీక్షణం వారి కోసం తపించడం. ది ఫైవ్ లవ్ లాంగ్వేజెస్ ప్రేమకు సంబంధించి కొన్ని భాషలు ఉన్నాయి. ప్రేమ గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుభూతి చెందుతారు. కొందిరికి ప్రియమైన వారితో గడపడం సంతోషాన్నిస్తుంది. మరికొందరికి వారి నుంచి తీసుకునే బహుమతులు ఆనందాన్నిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Sweating Benefits : విపరీతంగా చెమట వస్తే మంచిదే.. ఈ ప్రయోజనాలు దక్కుతాయి

Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఇదొక కొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్, ఈ పెళ్లిలో ఆ ముచ్చటే ఉండదు

Parenting Tips : పిల్లలు కార్టూన్లు ఎందుకు చూడకూడదో తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి

Pepper Fish Fry: పెప్పర్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే చిన్న ముక్క కూడా మిగలదు, చూస్తేనే నోరూరిపోతుంది

మీరు మీ ప్రియమైనవారి చేత ప్రశంసించబడితే.. లేదా మీ పట్ల వారు ఇష్టంతో ఉంటే.. ఇలా రకరకాలుగా ప్రేమను కొందరు వ్యక్త పరుస్తారు. నిజానికి ప్రేమకు ప్రాథమిక భాష ప్రేమించడమే. అయితో ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. వ్యక్తికరించే విధానం మీద ప్రేమ ఆధారపడి ఉంటుంది. అందరూ ఒకేలాగా ప్రేమను వ్యక్తపరచలేరు. ప్రేమగా మాట్లాడితే చాలా మంది నమ్మేస్తారు. ఏదైనా విషయంలో ప్రోత్సహించడం కూడా ప్రేమే. ప్రశంసలు కురిపించడం కూడా ప్రేమ బాషే. అవే మీకు నిజంగా సంతోషన్నిస్తాయి.

మీ ప్రియమైనవారు మీ మీద ఎక్కువగా శ్రద్ధ చూపడం కూడా ఒకరకమైన ప్రేమ భాష. మీరు వారితో మరింత కనెక్ట్ అయినట్లు అనిపిస్తే ఇంకా ఎక్కువ సమయం వారితో గడపాలనిపిస్తుంది. తగినంత సమయం గడపలేనప్పుడు ఏదో తెలియని బాధ మనసులో ఉంటుంది. క్వాలిటీ టైమ్ ప్రేమించిన వ్యక్తితో గడపడం అనేది ఒకరకమైన ప్రేమ భాష. దీనికోసం మీ ప్రియమైన వ్యక్తితో డేట్ నైట్‌లు, ఔటింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఆ సమయంలో మీరిద్దరూ మీ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయండి, కలిసి ఉండండి.. ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోండి.

ముట్టుకోవడం కూడా ఒక రకమైన ప్రేమ భాష. మనకు ఇష్టమైన వారి చేయి స్పర్శ తాకిన మనసుకు హాయిగా అనిపిస్తుంది. వాళ్లు మిమ్మల్ని టచ్ చేసినప్పుడు కలిగే అనుభూతి కూడా లవ్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు తాకినప్పుడు మనకు తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మనసు ఎన్నో మైళ్ల వేగంతో పరిగెడుతుంది. ప్రేమించిన వ్యక్తి స్పర్శ కూడా ప్రేమ భాష అని మీరు గుర్తించాలి.

కొందరు భాగస్వామి పట్ల నిస్వార్థమైన, దయగల చర్యలను చూపిస్తూ ఉంటారు. అది వారిని సంతోషపరుస్తుంది. ఇతరులు మీ కోసం అదే విధంగా చేసినప్పుడు మీరు కూడా ఇష్టపడాతరు. అడగకుండానే ఏదైనా పని చేసిపెడతారు. వారికి అన్ని పనుల్లో తోడు ఉంటారు. ప్రేమించిన వ్యక్తికి చేసే సేవ కూడా మీ రకమైన ప్రేమ భాషగా చెప్పవచ్చు. మీ మాటల కంటే.. మీరు చేసే పనులే వారికి ఎక్కువగా అర్థమవుతాయి. మీ నోటి కంటే అవి ప్రేమను ఎక్కువగా వ్యక్తపరుస్తాయి.

బహుమతులు స్వీకరించడం మీ ప్రేమ భాష అయితే బహుమతులు ఇవ్వడం, స్వీకరించడం ఇష్టపడతారు. ఇది మీకు విలువైనదిగా అనిపిస్తుంది. ఇష్టమైన వారు ఇచ్చిన బహుమతిని చాలా రోజులపాటు దాచిపెట్టుకుంటారు. పదే పదే చూసి మురిసిపోతారు. మీరు కూడా ప్రియమైన వారికి బహుమతి ఇచ్చేందుకు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు.

తదుపరి వ్యాసం