Sasivadane: గోదావరి ఒడిలో మరో ప్రేమకథ.. చిలిపిగా రక్షిత్ కోమలి రొమాన్స్.. లవ్లీగా శశివదనే టీజర్-rakshith atluri komali prasad sasivadane teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sasivadane: గోదావరి ఒడిలో మరో ప్రేమకథ.. చిలిపిగా రక్షిత్ కోమలి రొమాన్స్.. లవ్లీగా శశివదనే టీజర్

Sasivadane: గోదావరి ఒడిలో మరో ప్రేమకథ.. చిలిపిగా రక్షిత్ కోమలి రొమాన్స్.. లవ్లీగా శశివదనే టీజర్

Sanjiv Kumar HT Telugu
Jan 04, 2024 08:03 AM IST

Sasivadane Teaser: పలాస 1978 హీరో ప్రేమ్ రక్షిత్, బ్యూటిఫుల్ కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అందమైన ప్రేమకథ చిత్రం శశివదనే. మూవీ మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నేపథ్యంలో తాజాగా శశివదనే టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

గోదావరి ఒడిలో మరో ప్రేమకథ.. చిలిపిగా రక్షిత్ కోమలి రొమాన్స్.. లవ్లీగా శశివదనే టీజర్
గోదావరి ఒడిలో మరో ప్రేమకథ.. చిలిపిగా రక్షిత్ కోమలి రొమాన్స్.. లవ్లీగా శశివదనే టీజర్

Sasivadane Teaser Review: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్. స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హిస్తున్నారు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది.

‘శశివదనే’ సినిమా టీజర్‌ను మేకర్స్ బుధవారం (జనవరి 3) విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. హీరో (రక్షిత్ అట్లూరి), హీరోయిన్ (కోమలి ) కోసం ఆమె ఇంటి దగ్గర ఎదురచూడం, ఆమె కనపడకపోవటంతో కోమలికి డిఫరెంట్‌గా సిగ్నల్ పంపటం సన్నివేశాలు వైవిధ్యంగా ఉన్నాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి.

ఇక శశివదనే టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. అదేంటనేది మాత్రం తెలియకుండా దర్శక నిర్మాతలు సీక్రెట్‌ను మెయింటేన్ చేయటం చూస్తుంటే సినిమాలో హై మూమెంట్ ఏదో ఉందనే ఆసక్తి పెరుగుతోంది. అలాగే టీజర్‌లో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ కెమిస్ట్రీ చిలిపిగా చూడముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లుగా అనిపిస్తోంది.

శశివదనే చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న శశివదనే చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇక శశివదనే సినిమాకు శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తున్నారు.

అలాగే శశివదనే చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు. శశివదనే సినిమాలో హీరోహీరోయిన్లు రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్‌తోపాటు శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక శశివదనే సాకేంతిక వర్గం విషయానికొస్తే.. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్లపై గౌరీ నాయుడు సమర్పిస్తున్నారు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బర కథ రచనతోపాటు దర్శకత్వం చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా శ్రీసాయి కుమార్ దారా, సంగీతం శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ అనుదీప్ దేవ్, ఎడిటర్ గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ జేడీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పలాస 1978 సినిమాతో రక్షిత్ అట్లూరి మంచి ఫేమ్ అందుకున్నాడు. బలహీన వర్గాల అణచివేత వంటి కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలైని డైలాగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఇక నకిలేసు గొలుసు, బావ వచ్చాడు అనే పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అప్పుడు ఎక్కడ చూసిన నకిలేసు గొలుసు అనే పాట మారుమోగిపోయింది. ఈ పాటను ప్రముఖ సింగర్ రుఘు కుంచే కంపోజ్ చేశారు. ఇందులో రఘు కుంచే కీలక పాత్ర కూడా పోషించారు.

IPL_Entry_Point

టాపిక్