తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tecno Spark 8p । ఆకర్షణీయమైన ఫీచర్లతో టెక్నో నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

Tecno Spark 8P । ఆకర్షణీయమైన ఫీచర్లతో టెక్నో నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

07 July 2022, 22:08 IST

    • భారత మార్కెట్లో Tecno Spark 8P పేరుతో మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో కెమెరా, ర్యామ్, బ్యాటరీ ఫీవర్లు బాగున్నాయి. ధర కూడా చాలా తక్కువ. 
Tecno Spark 8P
Tecno Spark 8P

Tecno Spark 8P

చైనీస్ మొబైల్ తయారీదారు ట్రాన్షన్ టెక్నో తాజాగా మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Tecno Spark 8P పేరుతో విడుదలైనఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 2MP డెప్త్ సెన్సార్ అలాగే VGA లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్-మౌంటెడ్ కెమెరా సెటప్‌ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

ఈ ఫోన్ ముందు భాగం డాట్-నాచ్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే IPX2 రేటింగ్‌తో వాటర్ స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే బ్యాటరీ కూడా మెరుగ్గానే ఉంది. కనీసం ఒకరోజు బ్యాటరీ బ్యాకప్ అందించగలదు.

మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్‌లో అందిస్తున్న 4GB RAM అదనంగా 3GB వరకు విస్తరించుకునేలా వర్చువల్ మెమరీని కలిగి ఉంది, దీనిని Tecno మెమరీ ఫ్యూజన్ ఎక్స్‌టెన్షన్ అని పిలుస్తున్నారు. అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజీని మైక్రో SD కార్డ్ ద్వారా 512GBకి విస్తరించుకోవచ్చు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడవచ్చు.

Tecno Spark 8P స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.6 అంగుళాల IPS LCD ఫుల్ HD+ డిస్‌ప్లే
  • 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ Helio G85 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+2MP+ VGA కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

అంతేకాకుండా USB-C పోర్ట్, 4G LTE, WiFi, బ్లూటూత్, GPS, 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ధర, రూ. 10,999/-

ఈ ఫోన్ టర్కోయిస్ సియాన్, ఐరిస్ పర్పుల్, తాహితీ గోల్డ్, అట్లాంటిక్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం